ట్రైనీ ఐఏఎస్‌గా పోలీస్‌ అకాడమీకి కుమార్తె.. సెల్యూట్‌ చేసిన ఐపీఎస్‌ తండ్రి | Ips Officer Venkateswarlu Salutes To His Trainee Ias Daughter Uma Harathi | Sakshi
Sakshi News home page

ట్రైనీ ఐఏఎస్‌గా పోలీస్‌ అకాడమీకి కుమార్తె.. సెల్యూట్‌ చేసిన ఐపీఎస్‌ తండ్రి

Published Sat, Jun 15 2024 8:10 PM | Last Updated on Sat, Jun 15 2024 8:27 PM

Ips Officer Venkateswarlu Salutes To His Trainee Ias Daughter Uma Harathi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ పోలీస్ అకాడమీలో ఒక అరుదైన, స్ఫూర్తిదాయకమైన సన్నివేశం చోటు చేసుకుంది. తెలంగాణకు చెందిన ఉమాహారతి యూపీఎస్సీ సివిల్స్-2022 పరీక్షల్లో జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు సాధించిన సంగతి తెలిసిందే. అయితే, గతంలో నారాయణపేట జిల్లా ఎస్పీగా పని చేసిన ఆమె తండ్రి వెంకటేశ్వర్లు..  ప్రస్తుతం తెలంగాణ పోలీస్ అకాడమీలో ఆయన విధులు నిర్వర్తిస్తున్నారు.

ఉమాహారతి ట్రైనీ ఐఏఎస్‌గా తెలంగాణ పోలీస్ అకాడమీకి రావడంతో అక్కడ తన కుమార్తెను చూసి ఎస్పీ ర్యాంకు అధికారి అయిన వెంకటేశ్వర్లు హృదయం ఒక్కసారిగా ఉప్పొంగిపోయింది. గర్వంతో ఆయన తన కుమార్తెకు సెల్యూట్ చేసి.. పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

 


 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement