ఐపీఎల్‌ మ్యాచ్‌లను అడ్డుకుంటాం: టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే

IPL 2021 Auction Disappointed Says Khairatabad MLA Danam Nagender - Sakshi

ఎమ్మెల్యే దానం నాగేందర్‌

బంజారాహిల్స్‌: ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుకు తెలంగాణకు చెందిన ఒక్క క్రీడాకారుడిని కూడా ఎంపిక చేయకపోవడం పట్ల ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎందరో క్రీడాకారులను అందించిన హైదరాబాద్‌ నుంచి క్రికెట్‌కు ఆటగాడిని ఎంపిక చేయకపోవడం పట్ల ఆ జట్టు యాజమాన్యాన్ని దుయ్యబట్టారు. హైదరాబాద్‌కు చెందిన ఆటగాడు లేకుండా అది హైదరాబాద్‌ జట్టు ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు.

ఇప్పటికైనా పునరాలోచించి స్థానిక క్రికెటర్లను సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుకు ఎంపిక చేయకపోతే త్వరలో ఉప్పల్‌లో జరగనున్న ఐపీఎల్‌ మ్యాచ్‌లను అడ్డుకుంటామని హెచ్చరించారు. మిగతా అన్ని జట్లు తమ ప్రాంతం వారికి అవకాశం కల్పిస్తే ఎస్‌ఆర్‌హెచ్‌ మాత్రమే విదేశీ, ఇతర రాష్ట్రాల ఆటగాళ్లకు అవకాశం ఇచ్చిందని, ఇది చాలా బాధాకరమన్నారు.  

చదవండి:
ఆ రికార్డుకు ఆరు వికెట్ల దూరంలో..

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top