ఐటీ జాబ్స్‌: టాప్‌ 2లో మన హైదరాబాద్‌

Hyderabad Takes Second Place In IT Jobs Growth - Sakshi

రికార్డ్‌ స్థాయిలో ఐటీ జాబ్స్‌ వృద్ధి 

ముంబై: డిజిటలైజేషన్, ఆటోమేషన్‌ కారణంగా ఇన్ఫర్మేషన్‌ అండ్‌ టెక్నాలజీ (ఐటీ) రంగంలో ఉద్యోగ నియామకాలు ఊపందుకున్నాయి. జనవరి నెలతో పోలిస్తే ఫిబ్రవరిలో రికార్డ్‌ స్థాయిలో మంచి వృద్ధి నమోదయింది. అన్ని పరిశ్రమల్లో కలిపి జనవరిలో 1,925 జాబ్స్‌ హైరింగ్స్‌ జరగగా.. గత నెలలో 2,356 నియామకాలు జరిగాయని నౌకరీ జాబ్‌స్పీక్‌ ఇండెక్స్‌ సర్వే తెలిపింది. ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవటం, మార్కెట్‌ సాధారణ స్థితికి చేరుకోవటంతో కోవిడ్‌–19 తర్వాత తొలిసారిగా మెజారిటీ పరిశ్రమలలో నియామక కార్యకలాపాలలో సానుకూల థృక్పదాన్ని సాధించాయని నివేదక వెల్లడించింది.  నగరాల వారీగా చూస్తే.. దేశంలోని ఆరు మెట్రో నగరాలు, ప్రధాన ద్వితీయ శ్రేణి పట్టణాల్లో జాబ్స్‌ హైరింగ్‌లో సానుకూల వాతావరణ నెలకొంది. గత నెలలో 31 శాతం నియామక వృద్ధితో బెంగళూరు ప్రథమ స్థానంలో నిలవగా.. 28 శాతంతో హైదరాబాద్‌ రెండో స్థానంలో నిలిచింది. పుణేలో 24 శాతంగా ఉన్నాయి. వడోదరలో 20 హైరింగ్స్‌ ధోరణి కనిపించింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top