కస్టమర్‌ కేర్‌ అంటారు.. నిలువునా దోచేస్తారు..

Hyderabad: Police Alerts People Beware Of Cyber Crime Customer Care - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా, బ్యాంకుల విలీనం, వర్క్‌ ఫ్రం హోమ్, పార్ట్‌టైం జాబ్, కస్టమర్‌ కేర్, ఇన్వెస్ట్‌మెంట్స్‌ ప్రతీది సైబర్‌ నేరగాళ్లు మోసాలకు వేదికలుగా మలుచుకుంటున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఐటీ ఉద్యోగులు వర్క్‌ ఫ్రం హోమ్, నిరుద్యోగులు పార్ట్‌ టైం జాబ్స్‌లపై ఆసక్తి కనబరుస్తున్నారు. వీటిని ఆసరాగా చేసుకొని సైబర్‌ నేరగాళ్లు కంపెనీ ప్రతినిధులుగా మెయిల్స్‌ పంపి మోసాలకు తెర లేపుతున్నారు.

పలు బ్యాంకులు విలీనం కావటంతో ఖాతాదారులకు ఫోన్‌ చేసి కేవైసీ అప్‌డేషన్‌ లేదా క్రెడిట్‌ కార్డ్‌ లిమిట్‌ పెరుగుతుందనో మాట్లాడుతూ ఖాతా, క్రెడిట్‌/డెబిట్‌ కార్డ్, సీవీవీ నంబర్లు తీసుకుంటున్నారు. ఓటీపీ రాగానే దాని నమోదు చేస్తే సరిపోతుందని చెప్పి.. ఓటీపీ తీసుకొని ఖాతాలోని సొమ్ము స్వాహా చేస్తున్నారు.  

బాధితులు 30–40 ఏళ్ల వయస్కులే.. 
సైబర్‌ నేరాల్లో ప్రధానంగా కస్టమర్‌ కేర్, ఓఎల్‌ఎక్స్, జాబ్, కేవైసీ, ఇన్వెస్ట్‌మెంట్‌ పేరిట మోసాలు జరుగుతుంటాయి. ఎక్కువగా 30–45 ఏళ్ల వయస్సున్న వారే బాధితులవుతున్నారని సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ కే బాలకృష్ణా రెడ్డి తెలిపారు. రాజస్థాన్‌ నుంచి ఎక్కువగా ఓఎల్‌ఎక్స్‌ ప్రకటనల మోసాలు, జార్ఖండ్‌ నుంచి కస్టమర్‌ కేర్‌ మోసాలు జరుగుతున్నాయి. పెట్టుబడుల పేరిట జరిగే మోసాలకు లింక్‌లు ఎక్కువగా విదేశాళ„Š ళ ఉంటున్నాయి. ఆయా కేసుల విచారణ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని నేరస్తులను పట్టుకుంటామన్నారు.

గూగుల్‌లో వెతకొద్దు.. 
ఏదైనా కంపెనీకి సంబంధించిన కస్టమర్‌ కేర్‌ నంబరును తెలుసుకోవాలంటే ఆయా సంస్థ అధికారిక వెబ్‌సైట్‌లోనే సమాచారం తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో గూగుల్‌లో సెర్చ్‌ చేయొద్దు. గూగుల్‌లో వచ్చిన నంబరుకు కాల్‌ చేస్తే కస్టమర్‌ చార్జీ కోసం రూ.10 లను మోసగాళ్లు పంపే లింక్‌ ద్వారా చెల్లించమని కోరినా పలు యాప్స్‌ డౌన్‌లోడ్‌ చేయమని అడిగినా అది మోసమని గ్రహించాలి..
– కే.బాలకృష్ణా రెడ్డి, ఏసీపీ, సైబర్‌ క్రైమ్, సైబరాబాద్‌ కమిషనరేట్‌  

చదవండి: Bullettu Bandi Bride: ‘బుల్లెట్టు బండి’ వధువుకు బంపర్‌ ఆఫర్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top