బియ్యపు గింజ‌ల‌పై భగవద్గీత

Hyderabad Micro Artist Writes Bhagavad Gita On Rice Grains - Sakshi

సాక్షి, హైద‌రాబాద్ : బియ్య‌పుగింజ‌ల‌పై కేవ‌లం 150 గంట‌ల్లోనే భగవద్గీత రాసి  యువ‌తి రికార్డ్ సృష్టించింది. హైద‌రాబాద్‌కు చెందిన రామగిరి స్వారిక అనే  లా స్టూడెంట్ ఈ అరుదైన ఘ‌న‌త‌ను సాధించి అంద‌రి ప్ర‌శంస‌లు అందుకొంటుంది.  భగవద్గీత 18 అధ్యాయాల్లోని 700 శ్లోకాలను  మొత్తం 36,378 అక్షరాలతో కూడిన 9,839 పదాలతో 4,042 బియ్యపు గింజలపై రాశారు. చిన్న‌త‌నం నుంచే త‌న‌కు క‌ళ‌ల‌పై ఆసక్తి ఎక్కువని గ‌త కొన్నేళ్లుగా మైక్రో ఆర్ట్ చేస్తున్నాన‌ని వివ‌రించింది.

2017లో ఒకే బియ్యపు గింజపై ఆంగ్ల అక్షరమాల రాసినందుకు గాను అత్యత్తుమ మైక్రో ఆర్టిస్ట్‌గా అంత‌ర్జాతీయ వ‌ర‌ల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్వారిక  చోటు సంపాదించుకున్నారు. స్వారిక ప్ర‌తిభ‌కు గానూ గతేడాది నార్త్ దిల్లీ కల్చరల్ అసోసియేషన్  రాష్ట్రీయ పురస్కార్‌ను ప్రధానం చేసింది. ఇప్ప‌టివ‌ర‌కు వెయ్యికి పైగా మైక్రో డిజైనింగ్ చేసి ప‌లు స‌త్కారాలు అందుకొంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top