హైదరాబాద్‌లో యువజన కాంగ్రెస్ జాతీయ లీగల్ సెల్ కాన్‌క్లేవ్ | Hyderabad Hosts Youth Congress National Legal Cell Conclave | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో యువజన కాంగ్రెస్ జాతీయ లీగల్ సెల్ కాన్‌క్లేవ్

Jul 4 2026 10:00 PM | Updated on Jul 4 2026 10:00 PM

Hyderabad Hosts Youth Congress National Legal Cell Conclave

హైదరాబాద్: యువజన కాంగ్రెస్ లీగల్ సెల్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జాతీయ లీగల్ సెల్ కాన్‌క్లేవ్ విజయవంతంగా జరిగింది. ఈ సందర్భంగా హాజరైన న్యాయవాదులు, న్యాయ నిపుణులను ఉద్దేశించి ముఖ్య అతిథులు రాజ్యాంగ పరిరక్షణ, న్యాయవ్యవస్థ, న్యాయవ్యవస్థ దుర్వినియోగం, సామాజిక న్యాయం, యువ న్యాయవాదుల పాత్ర తదితర కీలక అంశాలపై ప్రసంగించారు.

దేశంలోనే తొలిసారిగా యువజన కాంగ్రెస్ లీగల్ సెల్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఇలాంటి జాతీయ స్థాయి కాన్‌క్లేవ్ నిర్వహించడం అభినందనీయమని ముఖ్య అతిథులు కొనియాడారు. నేషనల్ లీగల్ కాంక్లేవ్ లో న్యాయవాదులకు పరస్పర అనుభవాల మార్పిడి, సమకాలీన న్యాయ అంశాలపై అవగాహన పెంపొందించుకునేందుకు ఇటువంటి కాన్‌క్లేవ్‌లు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, జాతీయ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఉదయ్ భాను చిభ్, జాతీయ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆల్కలంబ, రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, బిహర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కృష్ణ అల్లవేరు, రాజ్యసభ సభ్యులు, సీనియర్ న్యాయవాది వివేక్ టoకీయా, ఏఐసీసీ సెక్రెటరీ సచిన్ సావంత్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు జక్కిడి శివచరణ్ రెడ్డి, యువజన కాంగ్రెస్ జాతీయ లీగల్ సెల్ కన్వీనర్ రూపేష్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర లీగల్ సెల్ కన్వీనర్ గూడూరు నిఖిల్ రెడ్డి, సీనియర్ న్యాయవాదులు నందితా రావు, సంజయ్ ఘోష్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement