
యాదగిరిగుట్ట: ఆదివారం సెలవు కావడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల భక్తులు యాదగిరి క్షేత్రానికి తరలివచ్చారు.
దీంతో శ్రీస్వామి వారి ధర్మ దర్శనానికి మూడు గంటలకు పైగా, వీఐపీ దర్శనానికి గంటకు పైగా సమయం పట్టింది. వివిధ పూజలతో శ్రీస్వామి వారికి నిత్యాదాయం రూ.53,64,989 వచ్చినట్లు ఆలయాధికారులు వెల్లడించారు.