62,400 మంది దాతలు.. రూ.16 కోట్లు.. బాలుడికి పునర్జన్మ

Huge Crowd Funds For Three Years Old Boy Suffering From Rare Disease - Sakshi

అరుదైన ఎస్‌ఎంఏతో బాధపడుతున్న మూడేళ్ల బాలుడు 

క్రౌడ్‌ఫండింగ్‌ ద్వారా నిధుల సేకరణ 

రూ.22 కోట్లు ఖరీదు చేసే ‘జొలెస్మా’ ఇంజెక్షన్‌ రూ.16 కోట్లకు కొనుగోలు 

దాతల సహకారంతో బాలునికి పునర్జన్మ 

సాక్షి, హైదరాబాద్‌: ఆ బిడ్డకు తల్లిదండ్రులు జన్మనిస్తే...దాతలు పునర్జన్మను ప్రసాదించారు. పుట్టుకతోనే అతి క్లిష్లమైన స్పైనల్‌ మసు్కలర్‌ ఆట్రోఫీ (ఎస్‌ఎంఏ) తో బాధపడుతున్న మూడేళ్ల బాలున్ని కాపాడేందుకు ప్రపంచ వ్యాప్తంగా 62,400 మంది దాతలు చేయూతను అందించారు. ఇందుకు ఇంపాక్ట్‌ గురు సంస్థ ఆన్‌లైన్‌ వేదికగా గత ఏడాది కాలంగా క్రౌడ్‌ ఫండింగ్‌ నిర్వహించి రూ.16 కోట్లు సమకూర్చింది. చందానగర్‌కు చెందిన ఓ సాఫ్ట్‌వేర్‌ దంపతులకు మూడేళ్ల క్రితం అయాన్ష్‌ గుప్తా జన్మించాడు.

శారీరక, మానసిక ఎదుగుదల లోపంతో బాధపడుతుండటంతో చికిత్స కోసం తల్లిదండ్రులు నగరంలోని సికింద్రాబాద్‌ రెయిన్‌బో ఆస్పత్రికి చెందిన పీడియాట్రిక్‌ న్యూరాలజిస్ట్‌ డాక్టర్‌ రమేష్‌ కోణంకికి చూపించారు. సదరు వైద్యుడు బాలుడికి పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. బాలుడు పుట్టుకతోనే అరుదైన వెన్నెముక సంబంధిత సమస్య (స్పైనల్‌ మసు్కలర్‌ ఆట్రోఫీ)తో బాధపడుతున్నట్లు గుర్తించారు.  

రూ.22 కోట్లు ఖరీదు చేసే ఇంజెక్షన్‌ 
ఈ వ్యాధికి చికిత్స కూడా చాలా ఖరీదుతో కూడినది కావడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. వైద్యుల సలహా మేరకు ఆన్‌లైన్‌ వేదికగా విరాళాలు సేకరించే ఇంపాక్ట్‌ గురు స్వచ్ఛంద సంస్థను ఆశ్రయించారు. సదరు నిర్వాహకులు ఆన్‌లైన్‌ వేదికగా దాతలను అభ్యరి్థంచారు. ఇందుకు దాతలు పెద్ద సంఖ్యలో ముందుకు వచ్చారు. సాధారణంగా ఇలాంటి అరుదైన వ్యాధితో బాధపడుతున్న పిల్లలకు చికిత్సల్లో భాగంగా రూ.22 కోట్ల విలువ చేసే ‘జొలెస్మా’ ఇంజెక్షన్‌ వాడాల్సి వస్తుంది.

ఇది అమెరికా నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంది. అయితే కేంద్రం రూ.6 కోట్లు దిగుమతి సుంకాన్ని రద్దు చేసింది. దాతల నుంచి సేకరించిన రూ.16 కోట్లు వెచి్చంచి కొనుగోలు చేసిన ఈ మందును బాలునికి ఇచ్చి ఆరోగ్య పరిస్థితిని మెరుగుపర్చారు. ప్రస్తుతం బాలుడు కోలుకోవడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. ఇదే తరహా వ్యాధితో బాధపడుతున్న ఇద్దరు పిల్లలకు ఇప్పటికే ఇదే ఆస్పత్రి లో విజయవంతంగా వైద్యం చేసినట్లు ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. శనివారం మీడియా ము ఖంగా చికిత్సకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించనున్నట్లు వైద్యవర్గాలు ప్రకటించాయి.
చదవండి: దిక్కులేని వారయ్యాం.. ఆదుకోండి

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top