తెలుగువారందరికీ గవర్నర్‌ శివప‍్రతాప్‌ శుక్లా ఉగాది శుభాకాంక్షలు | Hon’ble Governor’s Shiv Pratap Shukla Message on UGADI | Sakshi
Sakshi News home page

తెలుగువారందరికీ గవర్నర్‌ శివప‍్రతాప్‌ శుక్లా ఉగాది శుభాకాంక్షలు

Mar 18 2026 6:31 PM | Updated on Mar 18 2026 6:42 PM

Hon’ble Governor’s Shiv Pratap Shukla Message on UGADI

హైదరాబాద్: ప్రపంచంలోని తెలుగువారందరికీ తెలంగాణ గవర్నర్‌ శివప‍్రతాప్‌ శుక్లా ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ‘పరాభవ నామ ఉగాది శుభ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి తెలుగు మాట్లాడే సోదరులు, సోదరీమణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ తెలుగు నూతన సంవత్సరం మీకు, మీ కుటుంబ సభ్యులకు ఆశీర్వాదాలు, సమృద్ధి ప్రసాదించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

‘ఉగాది ఆనందం, ఆశల పండుగ. ఈ నూతన సంవత్సరం కొత్త ఉత్సాహం, ప్రకాశవంతమైన భవిష్యత్తును తీసుకురావాలి. ఉగాది స్ఫూర్తిని, సంప్రదాయ ఉగాది పచ్చడిలోని విభిన్న రుచులు సూచించే భావాన్ని ఆమోదించి, జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఆశావాద దృక్పథంతో ఎదుర్కొందాం. ఈ శ్రీ పరాభవ నామ సంవత్సరం ప్రతి ఒక్కరికీ, సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు శాంతి, సమృద్ధి, ఐక్యత, ఆరోగ్యం, ఆనందం తీసుకురావాలి’ అని గవర్నర్‌ శివప‍్రతాప్‌ శుక్లా తన సందేశంలో పేర్కొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement