వక్ఫ్ బోర్డు అసమర్థత కనిపిస్తోంది: హైకోర్టు

High Court: Why No Cases Were Filed On Ocupants Of Cemeteries - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ముస్లిం శ్మశాన వాటికలను కబ్జాల నుంచి పరిరక్షించాలన్న పటిషన్‌పై మంగళవారం తెలంగాణ హైకోర్టులో మంగళవారం విచారణ జరిపింది. ముస్లిం శ్మశాన వాటికల ఆక్రమణలపై నివేదికను వక్ఫ్ బోర్డు కోర్టుకు సమర్పించింది. దీనిపై స్పందించిన హైకోర్టు శ్మశానాల కబ్జాదారులపై కేసులు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించింది. అలాగే కబ్జాలను చాలా సాధారణ అంశంగా వక్ఫ్ బోర్టు చూస్తోందని పేర్కొంది. ఈ విషయంలో వక్ఫ్ బోర్డు అసమర్థత కనిపిస్తోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. (రాజస్తాన్‌ ఎడారిలా.. తెలంగాణ)

వక్ఫ్ బోర్డు చైర్మన్ మైనార్టీల కోసం పని చేస్తున్నారా అని హైకోర్టు ప్రశ్నించింది. దేవుడికి అంకితమిచ్చిన భూముల రక్షణకు బాధ్యతా యుతంగా ఉండాలని హితవు పలికింది. అయితే సిబ్బంది కొరత వల్ల, కరోనా వేళ మరింత ఇబ్బందిగా ఉందని వక్ఫ్ బోర్డు న్యాయవాది కోర్టుకు తెలిపారు. మంత్రికి చెబితే ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కరిస్తారు కదా అని హైకోర్టు బదులిచ్చింది. సర్వే నెంబర్ల వారీగా కబ్జాల వివరాలతో స్పష్టమైన నివేదిక ఇవ్వాలని వక్ఫ్‌‌ బోర్డును హైకోర్టు ఆదేశించింది. (ఫీల్డ్ అసిస్టెంట్ల పిటిషన్‌పై హైకోర్టు విచారణ)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top