
సాక్షి,హైదరాబాద్: బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. అల్పపీడనం కారణంగా వచ్చే నాలుగు రోజులపాటు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.
అల్పపీడనం బలపడి శనివారం(ఆగస్టు31) వాయుగుండంగా మారే అవకాశం ఉంది. శనివారం రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో పలు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. రాజధాని హైదరాబాద్ నగరంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడా భారీ వర్షం కురిసే అవకాశం ఉంది.