ఛాతిని తెరవకుండానే  గుండెకు ‘ఇంపెల్లా’ 

Heart Patient Treated Smallest Heart Pump IMPELLA  At AIG Hospitals In Hyderabad - Sakshi

70 ఏళ్ల వ్యక్తికి ఏఐజీలో విజయవంతంగా చికిత్స  

సాక్షి, సిటీబ్యూరో: తీవ్రమైన హృద్రోగ సమస్యతో బాధపడుతున్న ఓ వృద్ధునికి ఏఐజీ ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా చికిత్స చేశారు. ప్రస్తుతం ఆయన పూర్తిగా కోలుకోవడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేశారు. చికిత్సకు సంబంధించిన వివరాలను వైద్యులు శనివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. నగరానికి చెందిన 70 ఏళ్ల వృద్ధుడు ఆయాసం, ఛాతిలో నొప్పి సమస్యతో బాధపడుతూ ఈ నెల 14న గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో చేరారు.

వైద్యులు ఆయనకు 2డిఎకో పరీక్ష నిర్వహించగా, రక్తనాళాలు పూడుకుపోయి గుండె పంపింగ్‌ సామర్థ్యం దెబ్బతిన్నట్లు గుర్తించారు. అప్పటికే ఆయనకు కాలేయ మార్పిడి చికిత్స కూడా జరిగింది. దెబ్బతి న్న వాల్వ్‌ను పునరుద్ధరించేందుకు సాధారణంగా ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ చేస్తారు. కానీ రోగి వయసు రిత్యా ఇది రిస్క్‌తో కూడిన పనిగా వైద్యులు భావించారు.

ఆ మేరకు ఆస్పత్రి గుండె వైద్యనిపుణులు డాక్టర్‌ అంజు కపాడియా, డాక్టర్‌ రాజీవ్‌మీనన్, డాక్టర్‌ స్వరూప్, డాక్టర్‌ ఉదయ్‌ కిరణ్‌లతో కూడిన వైద్య బృందం ఛాతిని తెరువకుండానే ‘ఇంపెల్లా’ వైద్య పరికరాన్ని గుండెకు అమర్చారు. ఇది ప్రపంచంలోనే అతి చిన్న డివైజ్‌గా ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. ప్రస్తుతం రోగిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేసినట్లు ఆస్పత్రి చైర్మన్‌ డాక్టర్‌ నాగేశ్వర్‌రెడ్డి ప్రకటించారు. 
చదవండి: Covid-19: ప్రభుత్వ పనితీరు అభినందనీయం, గవర్నర్‌ ప్రశంసలు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top