పేదలకు మెరుగైనవైద్యమే జీఎస్‌ఆర్‌ ట్రస్టు లక్ష్యం | GSR Trust Goal To Provide Better Health Care For Poor: Srinivasa Rao | Sakshi
Sakshi News home page

పేదలకు మెరుగైనవైద్యమే జీఎస్‌ఆర్‌ ట్రస్టు లక్ష్యం

Sep 26 2021 4:17 AM | Updated on Sep 26 2021 4:17 AM

GSR Trust Goal To Provide Better Health Care For Poor: Srinivasa Rao - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పేద ప్రజలకు మెరుగైన వైద్యం, విద్య, ఉపాధి అందించాలన్నదే జీఎస్‌ఆర్‌ ట్రస్టు లక్ష్యమని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సంచాలకుడు డా.జి.శ్రీనివాసరావు పేర్కొన్నారు. తన తండ్రి సూర్యనారాయణరావు వర్ధంతిని శనివారం గోల్కొండ హోటల్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడారు. ఓ వైద్యుడిగా తన తండ్రి కొత్తగూడెం ప్రాంతంలో ఎంతో మందికి సేవలు చేశారని తెలిపారు.

కరోనా విపత్కర పరిస్థితుల్లో ఆయన్ను కోల్పోవడం తమ కుటుంబానికి తీరని బాధను మిగిల్చిందన్నారు. తండ్రి ఆశయాలను నెరవేర్చేందుకే జీఎస్‌ఆర్‌ ట్రస్టును ఏర్పాటు చేశామని వెల్లడించారు. జీఎస్‌ఆర్‌ ట్రస్టుకు తన పూర్తి మద్దతు ఉంటుందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ తెలిపారు. పేదలను గుర్తించి వారికి క్షేత్రస్థాయిలో విద్య, వైద్యం, ఉపాధి అందించేందుకు ట్రస్టులు ఎంతో ఉపయోగపడతాయన్నారు. కార్యక్రమంలో హెల్త్‌సెక్రటరీ రిజ్వీ, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ఎంవీరెడ్డి, సీఎం ఓఎస్డీ గంగాధర్‌ పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement