breaking news
gangadar
-
పేదలకు మెరుగైనవైద్యమే జీఎస్ఆర్ ట్రస్టు లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: పేద ప్రజలకు మెరుగైన వైద్యం, విద్య, ఉపాధి అందించాలన్నదే జీఎస్ఆర్ ట్రస్టు లక్ష్యమని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సంచాలకుడు డా.జి.శ్రీనివాసరావు పేర్కొన్నారు. తన తండ్రి సూర్యనారాయణరావు వర్ధంతిని శనివారం గోల్కొండ హోటల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడారు. ఓ వైద్యుడిగా తన తండ్రి కొత్తగూడెం ప్రాంతంలో ఎంతో మందికి సేవలు చేశారని తెలిపారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ఆయన్ను కోల్పోవడం తమ కుటుంబానికి తీరని బాధను మిగిల్చిందన్నారు. తండ్రి ఆశయాలను నెరవేర్చేందుకే జీఎస్ఆర్ ట్రస్టును ఏర్పాటు చేశామని వెల్లడించారు. జీఎస్ఆర్ ట్రస్టుకు తన పూర్తి మద్దతు ఉంటుందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. పేదలను గుర్తించి వారికి క్షేత్రస్థాయిలో విద్య, వైద్యం, ఉపాధి అందించేందుకు ట్రస్టులు ఎంతో ఉపయోగపడతాయన్నారు. కార్యక్రమంలో హెల్త్సెక్రటరీ రిజ్వీ, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎంవీరెడ్డి, సీఎం ఓఎస్డీ గంగాధర్ పాల్గొన్నారు. -
ఆర్టీసీ గుర్తింపు యూనియన్ ఎన్నికలపై సమావేశం
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ గుర్తింపు యూనియన్ ఎన్నిక కోసం కార్మిక శాఖ కమిషనర్‌తో గురువారం కార్మిక నేతలు సమావేశమైయ్యారు. ఈ సమావేశంలో ఓటరు తుది జాబితా, ఎన్నికల గుర్తులను ప్రకటించనున్నారు. అయితే తెలంగాణలో ఆర్టీసీ గుర్తింపు యూనియన్ ఎన్నికల్లో 49,856 ఓట్లు, 24,929 ఓట్లు వచ్చిన యూనియన్‌కు గుర్తింపు హోదా లభిస్తుంది. వచ్చె నెల 19న ఈ యూనియన్ గుర్తింపు ఎన్నికలు జరుగనున్నాయి. అదే రోజు ఫలితాలు విడుదల చేస్తారు. అదేవిధంగా జులై 25, 26 తేదీల్లో పోస్టల్ ఓట్లు ఉంటాయి. ఆగస్టు 8న అధికారకంగా తుది ఫలితాలను విడుదల చేస్తామని ఆర్టీసీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి గంగాధర్ వెల్లడించారు.