ఆర్టీసీ గుర్తింపు యూనియన్ ఎన్నికలపై సమావేశం | Recognised Union elections in TSRTC on july 19 | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ గుర్తింపు యూనియన్ ఎన్నికలపై సమావేశం

Jun 30 2016 4:43 PM | Updated on Sep 4 2017 3:49 AM

తెలంగాణ ఆర్టీసీ గుర్తింపు యూనియన్ ఎన్నిక కోసం కార్మిక శాఖ కమిషనర్తో గురువారం కార్మిక నేతలు సమావేశమైయ్యారు.

హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ గుర్తింపు యూనియన్ ఎన్నిక కోసం కార్మిక శాఖ కమిషనర్తో గురువారం కార్మిక నేతలు సమావేశమైయ్యారు. ఈ సమావేశంలో ఓటరు తుది జాబితా, ఎన్నికల గుర్తులను ప్రకటించనున్నారు. అయితే తెలంగాణలో ఆర్టీసీ గుర్తింపు యూనియన్ ఎన్నికల్లో 49,856 ఓట్లు, 24,929 ఓట్లు వచ్చిన యూనియన్కు గుర్తింపు హోదా లభిస్తుంది.

వచ్చె నెల 19న ఈ యూనియన్ గుర్తింపు ఎన్నికలు జరుగనున్నాయి. అదే రోజు ఫలితాలు విడుదల చేస్తారు. అదేవిధంగా జులై 25, 26 తేదీల్లో పోస్టల్ ఓట్లు ఉంటాయి. ఆగస్టు 8న అధికారకంగా తుది ఫలితాలను విడుదల చేస్తామని ఆర్టీసీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి గంగాధర్ వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement