ఎమ్మెల్యే రాజాసింగ్‌కు హైకోర్టులో ఊరట | Goshamahal MLA Rajasingh Got Relief In The High Court | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే రాజాసింగ్‌కు హైకోర్టులో ఊరట

Feb 10 2021 3:32 PM | Updated on Feb 10 2021 4:49 PM

Goshamahal MLA Rajasingh Got Relaxaion In The High Court - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : గోషామహల్‌ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ప్రజాప్రతినిధుల కోర్టు తీర్పుపై స్టే విధిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 2016 ఉస్మానియా బీఫ్ ఫెస్టివల్  వ్యవహారంలో ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనపై సెక్షన్ 295 ఏ కింద బొల్లారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక  ఐదేళ్ల తర్వాత ఈ కేసులో రాజా సింగ్‌కు ఒక సంవత్సరం జైలు శిక్ష విధిస్తూ ఇటీవలె నాంపల్లి ప్రత్యేక కోర్టు తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ రాజాసింగ్‌ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన అనంతరం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. (రాజాసింగ్‌కు షాక్‌.. ఏడాది జైలు శిక్ష)

Advertisement
 
Advertisement
Advertisement