Goల్స్‌ ఆడేద్దాం | Golf Clubs in Hyderabad | Sakshi
Sakshi News home page

Goల్స్‌ ఆడేద్దాం

Jul 11 2024 10:45 AM | Updated on Jul 11 2024 11:01 AM

Golf Clubs in Hyderabad

నగర జీవనశైలిలో భాగమైన క్రీడ
లగ్జరీ వసతుల జాబితాలో చోటు 
ఆట వచి్చనా స్టేటస్‌ సింబలే 
ఒత్తిడి, మానసిక, శారీరక వికాసానికి పరిష్కారం 
శివారు ప్రాంతాల్లో గోల్ఫ్‌ కోర్స్‌ ప్రాపరీ్టల అభివృద్ధి 
వీటితో భూముల విలువ రెట్టింపు 

ఒకప్పుడు సంపన్న వర్గాలకు మాత్రమే పరిమితమైన గోల్ఫ్‌.. క్రమంగా కామన్‌ మ్యాన్‌కు చేరువవుతోంది. నగరంలో ఏకంగా గోల్ఫ్‌ కోర్స్‌లు, క్లబ్‌లు ఏర్పాటవుతున్నాయి. ఇదొక ఆటగా కాకుండా జీవనశైలిగా మారిపోతోంది. గోల్ఫ్‌ కోర్స్‌ ప్రాపర్టీ ఉన్నా.. ఆడటం వచి్చనా స్టేటస్‌ సింబల్‌గా భావిస్తుండటంతో దశాబ్ద కాలంగా హైదరాబాద్‌లో గోల్ఫ్‌ ప్రాపర్టీలకు డిమాండ్‌ పెరుగుతోంది. దీంతో నగర శివారులో గోల్ఫ్‌ కోర్స్‌ థీమ్‌ ఆధారిత విల్లాలు, టౌన్‌షిప్‌లు, కమ్యూనిటీలు వెలుస్తున్నాయి. 

ప్రయోజనాలివీ..  
⇒ గోల్ఫ్‌ శిక్షణతో ప్రశాంతత, నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ, ఆత్మ విశ్వాసం పెరుగుతాయి. ఒత్తిడి తగ్గి మనసు, శరీరం సమన్వయంతో పనిచేస్తాయి.  

⇒ గోల్ఫ్‌ ఆటకు సగటున 4–5 గంటల సమయం పడుతుంది. ఇది చాలా శ్రమతో కూడుకున్నది. దీంతో మానసిక, శారీరక వికాసానికి దోహదపడుతుంది.

⇒ వాటర్‌ ఫ్రంట్‌ సెట్టింగ్‌లు, అద్భుతమైన వ్యూ, విలాసవంతమైన వసతులు, పచ్చటి వాతావరణం వంటి రకరకాల కారణాలతో గోల్ఫ్‌ కోర్స్‌ ప్రాపరీ్టల విలువ త్వరితగతిన పెరుగుతుంది. పునఃవిక్రయం సులువుగా ఉంటుంది.

⇒ ఈ ప్రాపరీ్టల్లో భూమి విలువ పెరుగుదల ఎక్కువగా ఉంటుంది.

ఒకే రకమైన ఆలోచనా ధోరణులు, భావాలు, ఆసక్తులు ఉన్న వ్యక్తులు ఒకే చోట ఉండటంతో కమ్యూనిటీ బంధాలు బలపడతాయి.

బ్రిటిష్‌ కాలంలో గోల్ఫ్‌ క్లబ్‌లకు బయట ‘కుక్కలు, భారతీయులకు అనుమతి లేదు’ అని రాసి ఉండేదట. మన దేశంలో గోల్ఫ్‌ రిచ్‌ గేమ్‌గా మారడానికి ఇదే కారణం. అప్పట్లో ఆంగ్లేయులు భారతీయులకు క్రీడలు నేర్పించేవారు కాదు. గోల్ఫ్‌ శిక్షణ కోసం ఏకంగా ఇంగ్లండ్‌కు వెళ్లాల్సిన పరిస్థితి. అయితే కాలక్రమేణా మన దేశంలో గోల్ఫ్‌ క్లబ్‌లు, సంఘాలు ఏర్పడటంతో అనతికాలంలో ప్రజాదరణ పొందింది. బ్యూరోక్రాట్స్, సీ–లెవల్‌ ఎగ్జిక్యూటివ్‌లు, యువ వ్యాపారస్తులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, ఉన్నత స్థాయి ఉద్యోగులు గోల్ఫ్‌ కోర్స్‌ ప్రాపరీ్టల్లో నివాసం ఉండేందుకు, పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.


ఉన్నత, ఎగువ మధ్య తరగతి..
సాధారణంగా గోల్ఫ్‌ కోర్టులకు ఎక్కువ స్థలం కావాలి. నగరాల్లో భూమి కొరత, ఖరీదు కారణంగా డెవలపర్లు గోల్ఫ్‌ ప్రాపర్టీను లాభదాయకమైన రియల్‌ ఎస్టేట్‌ ఫార్మాట్లుగా అభివృద్ధి చేస్తుంటారు. 18 హోల్స్‌ గోల్ఫ్‌ కోర్స్‌ ప్రాపర్టీని అభివృద్ధి చేయాలంటే కనిష్టంగా 100–120 ఎకరాల భూమి కావాలి. ఇందులో డ్రైవింగ్, ఆధునిక క్లబ్‌ హౌస్, రిసార్ట్స్‌ కూడా ఉంటాయి. సాధారణ లే–అవుట్‌లో గజం ధర రూ.10 వేలుగా ఉంటే.. గోల్ఫ్‌ ప్రాపర్టీల్లో రూ.20–25 వేలు ఉంటుంది. కాబట్టి డెవలపర్‌కు, యజమానికీ లాభదాయకంగా ఉంటుంది. పైగా ప్లాట్లు తక్కువగా ఉంటాయి కాబట్టి విక్రయం సులువవుతుంది.

తొలి, ఏకైక పీపీపీ గోల్ఫ్‌ క్లబ్‌ ఇక్కడే..
తెలంగాణలో 1992లో హైదరాబాద్‌ గోల్ఫ్‌ క్లబ్‌ (హెచ్‌జీఏ) ఏర్పాటైంది. పబ్లిక్‌ ప్రైవేట్‌ పార్ట్‌నర్‌షిప్‌ విధానంలో ఏర్పాటైన తొలి, ఏకైక క్లబ్‌ ఇదే. గోల్ఫ్‌ను ప్రోత్సహించేందుకు పర్యాటక శాఖ, హెచ్‌జీఏ గోల్కొండ వద్ద వంద ఎకరాల్లో 18 హోల్స్‌ గోల్ఫ్‌ కోర్స్‌ను ఏర్పాటు చేశాయి. ప్రస్తుతం 70 మంది విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు. వార్షిక రుసుము రూ.10 వేలు. ప్రస్తుతం హెచ్‌జీఏలో 2,500 మంది సభ్యులున్నారని హెచ్‌జీఏ కెపె్టన్‌ టీ అజయ్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు.

తల్లిదండ్రులు ప్రోత్సహించాలి

గోల్ఫ్‌తో రోజంతా ఉత్తేజంగా ఉంటుంది. టెన్నిస్, బ్యాడ్మింటన్‌ లాగే గోల్ఫ్‌ కూడా అంతర్జాతీయ ఆట. ఇటీవలే ఒలింపిక్స్‌లో కూడా దీన్ని పెట్టారు. విద్యార్థులు గోల్ఫ్‌ నేర్చుకునేందుకు తల్లిదండ్రులు వారిని ప్రోత్సహించాలి.
– కె.లక్ష్మారెడ్డి, గోల్ఫ్‌ ప్లేయర్, మాజీ ఎమ్మెల్యే

కోర్స్‌ పేరే ల్యాండ్‌ మార్క్‌
గోల్ఫ్‌ కోర్స్‌ ప్రాపరీ్టలు వచ్చాక ప్రాంతం రూపురేఖలే మారిపోతాయి. ఆ కోర్స్‌ పేరే ల్యాండ్‌మార్క్‌గా మారుతుంది. పైగా ఆయా 
ప్రాపరీ్టల్లోని క్లబ్‌హౌస్, రిసార్ట్‌ల నిర్వహణతో స్థానికులకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. 
– కె.సంతోష్‌రెడ్డి, సీఎండీ, డ్రీమ్‌ వ్యాలీ గ్రూప్‌

శివారులో గోల్ఫ్‌ ప్రాపరీ్టలు.. 
మెట్రో నగరాల్లోని స్థిరాస్తి రంగంలో గోల్ఫ్‌ ప్రాపర్టీ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విభాగం. ఎక్కువగా విల్లాలు, టౌన్‌షిప్‌లు, వాణిజ్య సముదాయాల్లో గోల్ఫ్‌ కోర్స్‌ ప్రాప     రీ్టలకు ఆదరణ ఉంటుంది. ప్రస్తుతం నగరం మ్యాక్, డ్రీమ్‌ వ్యాలీ, గిరిధారి, వర్టెక్స్, అపర్ణా వంటి పలు నిర్మాణ సంస్థలు వికారాబాద్, మోమిన్‌పేట్, తూప్రాన్, మన్నెగూడ, చేవెళ్ల, తుక్కుగూడ, శామీర్‌పేట వంటి ప్రాంతాల్లో గోల్ఫ్‌ కోర్స్‌ ప్రాప రీ్టలను అభివృద్ధి చేస్తున్నాయి. వీకెండ్‌లో కుటుంబంతో కలిసి ఆహ్లాదకరంగా గడిపేందుకు ఇక్కడే క్లబ్‌హౌస్, రిసార్ట్, హోటల్, వసతులు ఉంటాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement