‘సాక్షి’ వరుస కథనాలతో కదలిక.. జీహెచ్‌ఎంసీ కీలక నిర్ణయం

సాక్షి వరుస కథనాలు.. కుక్కల బెడదపై జీహెచ్ఎంసీ హై లెవెల్ కమిటీ - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కుక్కల బెడదపై సాక్షి వరుస కథనాలతో జీహెచ్ఎంసీ కదిలింది. మేయర్ అధ్యక్షతన అన్ని పార్టీల కార్పొరేటర్లు, అధికారులతో హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీని కోసం మూడు రోజుల క్రితమే ఆల్‌ పార్టీ మీటింగ్ నిర్వహించిన సంగతి తెలిసిందే.

జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేసిన హై లెవెల్ కమిటీలో బీఆర్‌ఎస్‌ నుంచి రహమత్ నగర్ కార్పొరేటర్ సీ.ఎన్.రెడ్డి, చిలుకానగర్ కార్పొరేటర్ శ్రీమతి బన్నాల గీతా ప్రవీణ్, బీజేపీ నుంచి బాగ్ అంబర్ పేట్ కార్పొరేటర్‌ పద్మ వెంకట్‌రెడ్డి, మల్కాజ్ గిరి కార్పొరేటర్ వీ శ్రావణ్, కాంగ్రెస్ నుంచి లింగోజిగూడ కార్పొరేటర్ ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి, ఉప్పల్ కార్పొరేటర్ ఎం రజిత, ఎంఐఎం నుండి పత్తర్ గట్టి కార్పొరేటర్ సయ్యద్ సోహెల్ ఖాద్రీ, రియాసత్ నగర్ కార్పొరేటర్ మిర్జా ముస్తఫా బేగ్‌లు సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీకి కో-ఆర్డినేట్ ఆఫీసర్‌గా డాక్టర్‌ జేడీ విల్సన్ (డిప్యూటీ డైరెక్టర్ వెటర్నరి) వ్యవహరించనున్నారు.

ఈ హై లెవల్ కమిటీ జీహెచ్ఎంసీ పరిధిలోని యానిమల్ కేర్ సెంటర్లను పరిశీలించి అవసరమైన అభివృద్ధికి  సూచనలు, సలహాలతో నివేదిక అందజేయనుంది.
చదవండి:  సడన్‌ హార్ట్‌ ఎటాక్‌.. కాలేజీలోనే కుప్పకూలిన ఇంజనీరింగ్‌ విద్యార్థి..

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top