డెక్కన్‌మాల్‌ కూల్చివేతకు రంగం సిద్ధం..హైదరాబాద్‌ కంపెనీకే టెండర్‌

GHMC Decided To Demolish Deccan Mall On Wednesday Itself - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సికింద్రాబాద్‌లో అగ్నిప్రమాదానికి గురైన రాంగోపాల్‌ పేట డెక్కన్‌ మాల్‌  కూల్చివేత పనులకు జీహెచ్‌ఎంసీ రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ మంగళవారం ఒక రోజు గడువుతో సంబంధిత కాంట్రాక్ట్‌ ఏజెన్సీలను ఆహ్వానించి సుమారు రూ. 33.86 లక్షల అంచనాలతో టెండర్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.  ఐతే ఈ టెండర్‌ను హైదరాబాద్‌కు చెందిన ఎస్కే మల్లు కంపెనీ రూ. 22 లక్షలకు దక్కించుకుంది.

కాగా, ఈ ‍ప్రమాద ఘటనలో మృతి చెందిన ఇద్దరి ఆచూకీ మాత్రం తెలియరాలేదు. ఆ బాధితుల గురించి స్పష్టత వచ్చాక కూల్చాలని భావించినా..ఈ లోపే కూలిపోతే నష్టం వాటిల్లుతుందన్న నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఆయా బాధిత కుటుంబీకులను ఒప్పించి గురువారమే కూల్చివేసేందుకు జీహెచ్‌ఎంసీ రెడీ అయ్యింది.

(చదవండి: ఇక నేలమట్టమే.. అంచనా వ్యయం రూ. 41 లక్షలు)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top