హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా చేపట్టిన ఆర్టీసీ కార్మికుల సమ్మె తీవ్రరూపం దాల్చే అవకాశం కనబడుతోంది. ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్యాయత్నం చేసిన తర్వాత తెలంగాణ ప్రభుత్వ పెద్దలు చర్చలకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించినప్పటికీ ఆర్టీసీ జేఏసీ తమ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించింది.
ముందుగా శంకర్ గౌడ్‌కు ఏమైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత అంటూ హెచ్చరించిన ఆర్టీసీ జేఏసీ.. రేపటి నుంచి అన్ని డిపోల ఎదుట మౌన దీక్షలు చేపట్టనున్నట్లు ప్రకటించింది.

సమ్మెపై తెలంగాణ ఆర్టీసీ జేఏసీ భవిష్యత్ కార్యాచరణ ఇదే..
రేపటి నుంచి అన్ని డిపోల ఎదుట ఆర్టీసీ జేఏసీ మౌనదీక్షలు
ఈ నెల 25 నుంచి అన్ని డిపోల్లో వంటా వార్పు
26వ అన్ని జిల్లాలో ఆర్టీసీ కార్మికుల కవాతు
ఈనెల 27వ తేదీ ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలకు వినతి పత్రాలు
28వ తేదీన మహిళా ఉద్యోగులతో డిపోల వద్ద బతుకుమ్మలతో నిరసన
29వ తేదీన అన్ని డిపోల ఎదుట కార్మికుల అర్ధనగ్న నిరసనలు


