Hyd: టైర్ల దుకాణంలో భారీ అగ్నిప్రమాదం | Early Morning Fire At Tire Shop In Suchitra Center Basheerabad, Short Circuit Destroys Entire Inventory | Sakshi
Sakshi News home page

Hyderabad: టైర్ల దుకాణంలో భారీ అగ్నిప్రమాదం

Nov 29 2025 7:05 AM | Updated on Nov 29 2025 12:45 PM

Fire in tire shop at Suchitra Center

సాక్షి, మేడ్చల్: పేట్ బషీరాబాద్ పరిధిలోని సుచిత్ర సెంటర్‌లో గల ఒక టైర్ల దుకాణంలో శనివారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. ఉదయం నాలుగు గంటల సమీపంలో ఇక్కడి శ్రీ రాఘవేంద్ర నగర్ కాలనీ లోని సన్ రైస్ వాటర్ వాష్ అండ్‌ వీల్ అలైన్‌మెంట్ షాప్‌లో ఈ ప్రమాదం సంభవించింది. 

నాలుగు ఫైర్ ఇంజన్ల సహకారంతో  అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెస్తున్నారు. చుట్టుపక్కల వారిచ్చిన సమాచారంతో సకాలంలో స్పందించిన అగ్నిమాపక సిబ్బంది  నాలుగు ఫైర్ ఇంజన్లతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటన కారణంగా దుకాణంలోని సామగ్రి అంతా కాలి బూడిదయ్యింది. ఈ ప్రమాదాన్ని చూసిన స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement