ఆస్పత్రి బాత్రూమ్‌ డోర్‌లాక్‌.. చిన్నారిని రక్షించిన ఫైర్‌ సిబ్బంది | Sakshi
Sakshi News home page

ఆస్పత్రి బాత్రూమ్‌ డోర్‌లాక్‌.. చిన్నారిని ఫైర్‌ సిబ్బంది ఎలా రక్షించారో చూడండి

Published Sun, Jan 22 2023 7:57 PM

Fire Service Personnel Rescue Kid Locked KIMS Hospital Bathroom - Sakshi

సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో ఓ చిన్నారి తల్లిదండ్రులను, ఆస్పత్రి సిబ్బందిని కాసేపు ఉరుకులు పరుగులు పెట్టించాడు. వాష్ రూమ్‌లోకి వెళ్లి అనుకోకుండా లాక్‌ వేసేసుకున్నాడు. దీంతో అక్కడే ఇరుక్కుపోయి ఏడ్వసాగాడు. 

ఈ విషయాన్ని గుర్తించిన చిన్నారి తల్లిదండ్రులు.. ఆస్పత్రి నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లారు. తాళాలు లేకపోవడంతో ఫైర్‌ సేఫ్టీ సిబ్బందికి కాల్‌ చేశారు. వాళ్లు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. బాలుడిని రక్షించే యత్నం చేశారు.  సుత్తి, స్క్రూడ్రైవర్‌తో తాళం పగులగొట్టి చిన్నారిని బయటకు తీసుకొచ్చారు. 

ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు అత్యవసర పరిస్థితుల్లో.. 101కు డయల్‌ చేయాలని తెలంగాణ ఫైర్‌ సర్వీసెస్‌ ట్విటర్‌ పేజీలో ఆ వీడియోను పోస్ట్‌ చేసింది. 

Advertisement
 
Advertisement