సెక్స్‌ వర్కర్ల ఓటర్‌ ఐడీలపై నివేదికివ్వండి

Election Commissioner Shashank Goyal Review On Sex Workers Voter Id Card - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని జీహెచ్‌ఎంసీతోపాటు అన్ని జిల్లాల్లో ఉన్న సెక్స్‌ వర్కర్లను ఓటర్లుగా నమోదు చేయడంతోపాటు వారికి ఓటర్‌ ఐడీ కార్డులెన్ని ఇచ్చారన్న దానిపై నివేదిక ఇవ్వాలని ఎన్నికల సంఘం జిల్లా కలెక్టర్లు, ఎన్నికల అధికారులను ఆదేశించింది. ఈ మేరకు  రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్‌గోయల్‌ లేఖ రాశారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా జిల్లాలు, నియోజక వర్గాల వారీగా సెక్స్‌ వర్కర్ల నమోదు, వారికి ఓటరు కార్డుల పంపిణీపై వీలున్నంత త్వరగా నివేదిక ఇవ్వాలని ఆ లేఖలో పేర్కొన్నారు.  

పీపుల్స్‌ ఫ్రెండ్లీ విధానాలు అమలు చేయండి: సీఎస్‌ 
సాక్షి, హైదరాబాద్‌: ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ (ఈఓడీబీ)లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉందని, ఇదే విధానాన్ని భవిష్యత్తులో కూడా కొనసాగించాలని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ పలు శాఖల ఉన్నతాధికారులకు సూచించారు. సీఎం కేసీఆర్‌ సూచనల మేరకు బీఆర్‌కే భవన్‌లో ఆయన రెవెన్యూ, పౌరసరఫరాలు, రవాణా, విద్యుత్, గృహ నిర్మాణం, మున్సిపల్, కార్మిక తదితర 12 విభాగాల పనితీరుపై సమీక్ష నిర్వహించారు.

ఆయా శాఖల ద్వారా స్టేక్‌హోల్డర్లతో పాటు ప్రజలకు మెరుగైన సేవలందించాలని సీఎస్‌ సూచించారు. ఈ 12 శాఖల్లోని 20 విభాగాల పరిధిలో 301 సంస్కరణలు అమలవుతున్నాయని, వీటిని మరింత సరళీకృతం చేసి యూజర్, పీపుల్స్‌ ఫ్రెండ్లీ విధానాలను అమల్లోకి తేవాలన్నారు.   

చదవండి: కూతురు ప్రేమ వివాహం.. తండ్రి  ఆత్మహత్య 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top