25 నుంచి వెబ్‌సైట్‌లో ఈ–సెట్‌ హాల్‌టికెట్లు 

E-set Hall Tickets On Website From August 25th - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఈ నెల 31న నిర్వహించనున్న ఈసెట్‌–20 పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను 25వ తేదీ నుంచి వెబ్‌సైట్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సెట్‌ కన్వీనర్‌ ఎం.మంజూర్‌హుస్సేన్‌ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. సీబీటీ (కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌) పద్ధతిలో నిర్వహించే ఈ పరీక్షను 56 కేంద్రాల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. ఇందులో రాష్ట్రవ్యాప్తంగా 52 సెంటర్లు, ఏపీలో 4 సెంటర్లలో ఉన్నాయని వెల్లడించారు.

21, 22న వెబ్‌ ఆప్షన్లు 
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని పీజీ మెడికల్, డెంటల్‌ కళాశాలల్లో మిగిలిపోయిన కన్వీనర్‌ కోటా సీట్ల భర్తీకి ఈ నెల 21న ఉదయం 8 గంటల నుంచి 22న మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రాధాన్యత క్రమంలో కళాశాలల వారీగా వెబ్‌ ఆప్షన్లను నమోదు చేసుకోవాలని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. అర్హులైన అభ్యర్థులు ఈ వెబ్‌ కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చని పేర్కొంది. గత విడత కౌన్సెలింగ్‌లో సీటు అలాట్‌ అయినా చేరని అభ్యర్థులు, కళాశాలలో చేరి డిస్‌కంటిన్యూ చేసిన అభ్యర్థులు ఈ వెబ్‌ కౌన్సెలింగ్‌కు అనర్హులని ప్రకటించింది. ఆలిండియా కోటా కౌన్సెలింగ్‌ కింద ఇప్పటికే చేరిన అభ్యర్థులను కూడా అనర్హులుగా పరిగణిస్తారని తెలిపింది. మరిన్ని వివరాలకు  www.knruhs. telangana.gov.in  వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించింది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top