దేవాదుల పైప్‌లైన్‌ లీకేజీ  | Devadula Project Water Pipeline Leak In Hanamkonda District | Sakshi
Sakshi News home page

దేవాదుల పైప్‌లైన్‌ లీకేజీ 

Feb 12 2023 3:14 AM | Updated on Feb 12 2023 10:24 AM

Devadula Project Water Pipeline Leak In Hanamkonda District - Sakshi

పులుకుర్తి సమీపంలో ఎగసిపడుతున్న దేవాదుల నీరు  

దామెర: దేవాదుల పైప్‌లైన్‌ లీకేజీతో ఒక్కసారిగా నీరు నింగిని తాకే విధంగా పైకి ఎగజిమ్మింది. ఈ ఘటన హనుమకొండ జిల్లా దామెర మండలం పులుకుర్తి సమీపంలో శనివారం చోటుచేసుకుంది. పులుకుర్తిలోని దేవాదుల పంప్‌ హౌజ్‌ నుంచి భీంఘన్‌పూర్‌ పంప్‌హౌజ్‌కు నీటిని పంపింగ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో పులుకుర్తి శివారులో శనివారం ఉదయం గేట్‌వాల్వ్‌ లీకేజీ కావడంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు నీరు ఎగిసిపడింది.

దీంతో సమీపప్రాంతం మొత్తం జలమయమైంది. పులుకుర్తి గ్రామానికి చెందిన రైతు పండుగ రవి తన రెండెకరాల పొలంలో ఇటీవల నాట్లు వేయగా పొలం పూర్తిగా మునిగిపోయింది. లీకేజీ విషయమై సంబంధిత అధికారులకు, సిబ్బందికి సమాచారం అందించినప్పటికీ ఎవరూ స్పందించడం లేదని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. గతంలోనూ పైప్‌లైన్‌ లీకేజీతో రెండెకరాల పత్తి పూర్తిగా మునిగి నష్టం వాటిల్లిందని  రవి వాపోయారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement