
పండుగకు జనం స్వగ్రామాల బాట
చౌటుప్పల్ రూరల్: ప్రభుత్వం దసరా సెలవులు ప్రకటించడంతో పాటు ఆదివారం బతుకమ్మ పండుగ ఉండడంతో హైదరాబాద్‌లో నివాసముంటున్నవారు.. శనివారం సాయంత్రం నుంచి స్వగ్రామాలకు పయనమయ్యారు. దీంతో హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది.
వాహనాలు భారీగా రావడంతో హైవేపై వాహనాలు నెమ్మదిగా ముందుకు సాగాయి. పంతంగి టోల్‌ప్లాజాలో శనివారం సాయంత్రం వాహనాలు కిక్కిరిశాయి. విజయవాడ వైపు వెళ్లే మార్గంలో ఎనిమిది విండోల ద్వారా వాహనాలను టోల్ సిబ్బంది పంపించారు.