
సాక్షి, ఆదిలాబాద్: కోవిడ్‌తో జిల్లాలో మరొకరు మరణించారు. గురువారం బోథ్‌కు చెందిన ఒకరు కరోనాకు బలి అయ్యారు. ఇతను బీపీ, షుగర్‌వ్యాధితో బాధపడుతున్నట్లు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ తెలిపారు. దీంతో జిల్లాలో మృతుల సంఖ్య 18కి చేరింది. జిల్లాలో ఇప్పటివరకు 17,371 నమూనాలు సేకరించగా, 1423 మందికి పాజిటివ్ వచ్చింది. 653 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. గురువారం 1,575 నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించా రు. ఒకరు మృతి చెందగా, 76 మందికి పాజిటివ్ వ చ్చింది. 6 నమూనాలు పెండింగ్‌లో ఉండగా, 27 మ ంది డిశ్చార్జ్ అయినట్లు డీఎంహెచ్‌లో పేర్కొన్నారు.
ప్రాంతాల వారీగా కేసులు ఇలా..
ఆదిలాబాద్ పట్టణంలోని అశోక్‌రోడ్‌లో 1, భీంసరి 1, భుక్తాపూర్ 3, బ్రాహ్మణవాడ 1, ఛోటతలాబ్ 1, కైలాస్‌నగర్ 1, క్రాంతినగర్ 1, కేఆర్‌కేకాలనీ 1, మహాలక్ష్మీవాడ 1, న్యూ కుమ్మరికుంట 1, పాత హౌసింగ్‌బోర్డు 4, పీహెచ్‌సీలో కాలనీ 1, పిట్టల్‌వాడ 2, పుత్లీబౌళి 1, రాంనగర్ 1, రాణిసతీజి రోడ్ 1, రవీంద్రనగర్ 3, రిమ్స్ క్వార్టర్స్ 2, సాలెగూడ 1, సంజయ్‌నగర్ 1, శాంతినగర్ 3, టైలర్స్‌కాలనీ 3, తాటిగూడ 5, టీచర్స్ కాలనీ 2, తిర్పెల్లి 3, విద్యానగర్ 2, బోథ్‌లోని 5వ బ్లాక్ 8, బోథ్ మండలం కౌఠ(బి) 2, మావల 1, ఉట్నూర్‌లోని బోయవాడలో 1, ఉట్నూర్ మండలం పులిమడుగులో 5, ఉట్నూర్‌లోని వేణునగర్‌లో 1, జైనథ్ మండలం గిమ్మలో 1, నేరడిగొండ 2, ఇంద్రవెల్లి మండలం ముత్నూర్‌లో 4, తాంసి మండలం గిర్‌గావ్‌లో 3, గుడిహత్నూర్ ఎస్సీకాలనీలో 1 చొప్పున కేసులు నిర్ధారణ అయినట్లు డీఎంహెచ్‌ఓ వివరించారు.