‘వేతన’ ఉద్యోగాలపై కోవిడ్‌ ఎఫెక్ట్‌! | Sakshi
Sakshi News home page

‘వేతన’ ఉద్యోగాలపై కోవిడ్‌ ఎఫెక్ట్‌!

Published Mon, Aug 24 2020 5:31 AM

Coronavirus Affected On Salaried Jobs - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌ మహమ్మారి వేతనజీవుల(శాలరీడ్‌ జాబ్స్‌) పాలిట శాపమైంది. కరోనా వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ఐదునెలల క్రితం దేశవ్యాప్తం గా తొలిసారిగా విధించిన లాక్‌డౌన్‌తో పెద్దసంఖ్యలో ఉద్యోగాలు కోల్పోయారు. అయితే, కోల్పోయిన ఆ అవకాశాలు తిరిగి సాధించుకోవడం కొంతమేర కష్టసాధ్యం కావొచ్చని సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇం డియన్‌ ఎకానమీ (సీఎంఐఈ) అంచనా వేస్తోంది. ఉద్యోగాలు కోల్పోవడం, ఆదాయం, కొనుగోలు శక్తి తగ్గిపోయి పరోక్షంగా ఆ ప్రభావం ఆర్థిక వ్యవస్థపై పడుతోందని ఈ సంస్థ భావిస్తోంది.

జూలైలోనే 50 లక్షల జాబ్స్‌కు ఎసరు..
కోవిడ్‌–19 ప్రత్యక్ష, పరోక్ష ప్రభావాల కారణంగా ఇప్పటివరకు 1.89 కోట్లమంది ఉద్యోగాలు కోల్పోయినట్టు సీఎఈంఐఈ తాజాగా వెల్లడించింది. ఒక్క జూలైలోనే 50 లక్షల మంది తమ జాబ్స్‌ను వదులుకోవాల్సి వచ్చిందని పేర్కొంది. ఈ పరిస్థితుల కారణంగా పెద్ద కంపెనీలు, సంస్థల మార్కెట్‌ వాటా పెరగడంతోపాటు కార్మి కులు, పనివారిపై ఆధారపడటం తగ్గొచ్చ ని, అదే సమయంలో చిన్న, మధ్యతరహా కంపెనీలు, సంస్థలు వంటివి నష్టపోయి క్రమంగా మూతపడే పరిస్థితులు తలెత్త వచ్చని, ఉద్యోగుల ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కోల్పోవచ్చని సీఎంఐఈ ఎండీ మహేశ్‌ వ్యాస్‌ చెబుతున్నారు. అయితే నెలవారీ వేతనాలు, జీతాల్లేని, అనియత రంగాల్లో ఉద్యోగాలు (ఇన్‌ఫార్మల్‌ జాబ్స్‌) పెరిగినట్టు సీఎంఐఈ వెల్లడించింది. ఒక్క వ్యవసాయరంగంలోనే 1.5 కోట్ల ఉపాధి అవకాశాలు పెరిగినట్టు పేర్కొంది. 

అకస్మాత్తుగా ఏదైనా జరిగితే..
కరోనా, లాక్‌డౌన్‌ మాదిరిగా అకస్మాత్తుగా ఏదైనా జరిగితే మోటార్‌మెకానిక్, కార్పెం టర్, తాపీ మేస్త్రీ వంటి వారు వెంటనే తమ ఉపాధి అవకాశాలు కోల్పోతారని, లాక్‌డౌన్‌ ఎత్తేశాక మళ్లీ వారికి ఆ పనులు దొరుకుతాయని సీఎంఐఈ విశ్లేషిస్తోంది. 

Advertisement
Advertisement