డీహెచ్‌ పూజలు: ఖమ్మం ‘చంద్రముఖి’ నిజ స్వరూపం: అప్పుడు.. ఇప్పుడు

Controversy Of Telangana Health Director Srinivas Worship In Khammam  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సామాన్య జనాలకు మూఢ నమ్మకాల నిర్మూలనపై అవగాహన కల్పించాల్సిన వ్యక్తే.. ఓ దేవతా అవతారం ఎత్తిన ఎంపీపీ చుట్టూ ప్రదక్షిణలు చేయడం చర్చాంశనీయంగా మారింది. ఆయనే తెలంగాణ హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు.. అంతేకాదు ఆమె ఆశ్వీరాదం కోసం వంగి వంగి దండాలు పెడుతూ తాను కూడా మిరపకాయల పూజలు చేశారు. మరో అడుగు ముందుకేసి.. ఆమెను పొగడ్తలతో ముంచెత్తారు. మాతను దర్శించుకోవడం తన పూర్వ జన్మ సుకృతం అంటూ భక్తిని చాటుకున్నారు. విచిత్రమేమిటంటే.. తనతో పాటు డాక్టర్లు, వైద్య సిబ్బందిని కూడా తీసుకెళ్లి పూజలు చేయించడం మరింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

చదవండి: వివాదంలో తెలంగాణ డీహెచ్‌.. ఖమ్మంలో విచిత్ర పూజలు..  

అనేక వివాదాల్లో ఉన్న ఎంపీపీ దేవత అవతారం ఎత్తడం విచిత్రం. తను నడిచే నడక, చూపు, మాట అంతా అమ్మవారిలా కనిపించేలా తెగ కవర్ చేస్తూ భక్తులకు దర్శనమిచ్చింది. మరో విశేషమేమిటంటే.. ఎంపీపీ భర్త సింగరేణి ఉద్యోగి. ఆయన సైతం డ్యూటీకి వెళ్లకుండా పూజలో నిమగ్నమయ్యారు. పూజలు, హోమాలు, అన్నదానాల పేరుతో వీళ్లు చేసే దందా అంత ఇంత కాదు. భూత, భవిష్యత్, వర్తమానం గురించి చెప్తా అంటూ అమాయక ప్రజలను మోసం చేసే ఇలాంటి వారిపై ప్రభుత్వం చర్యలు చేపట్టాలి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top