తెలంగాణ సెక్రటేరియట్‌లో మళ్లీ వాస్తు మార్పులు.. | Congress Government make Vastu changes at telangana secretariat | Sakshi
Sakshi News home page

తెలంగాణ సెక్రటేరియట్‌లో మళ్లీ వాస్తు మార్పులు..

Jun 3 2024 5:22 PM | Updated on Jun 3 2024 7:02 PM

Congress Government make Vastu changes at telangana secretariat

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ సచివాలయంలో మరోసారి వాస్తు మార్పులు చేయాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు సెక్రటేరియట్‌ ప్రధాన ద్వారం నుంచి లోపలికి వచ్చిన సీఎం రేవంత్‌ రెడ్డి కాన్వాయ్‌.. ఇక నుంచి వెస్ట్‌ గేట్‌ నుంచి లోపలికి వచ్చి నార్త్‌ ఈస్ట్‌ గేట్‌ నుంచి బయటకు వెళ్లిపోనున్నట్లు సమాచారం. ఇక సౌత్‌ ఈస్ట్‌ గేట్‌ ద్వారా ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఇతర ఉన్నతాధికారుల రాకపోకలు జరగనున్నాయి.

కాగా రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా వాస్తు మార్పులు చేయించారు. గతంలో ఆరో అంతస్తులో ఉన్న ముఖ్యమంత్రి కార్యాలయాన్ని తొమ్మిదో అంతస్తులోకి మార్చాలని నిర్ణయించారు. ప్రస్తుతం తొమ్మిదో అంతస్తులో సీఎంవో ఏర్పాటు కోసం పనులు కొనసాగుతున్నాయి. వీటితో పాటు సెక్రటేరియట్‌ లోపల మరికొన్ని మార్పులు కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement