Yadadri Bhuvanagiri Collector Son Name Registered Anganwadi Center Yadadri - Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీ కేంద్రంలో కలెక్టర్‌ బిడ్డ

Feb 3 2022 5:55 AM | Updated on Feb 3 2022 9:05 AM

Collector Son Name Registered Anganwadi Center Yadadri - Sakshi

నైతిక్‌కు బాలామృతం అందజేస్తున్న అంగన్‌వాడీ టీచర్, చిత్రంలో కలెక్టర్‌ పమేలా సత్పతి 

సాక్షి, యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి తన కుమారుడి పేరును అంగన్‌వాడీ కేంద్రంలో నమోదు చేయించారు. రాయిగిరి అంగన్‌వాడీ టీచర్లు ఇంటింటి సర్వేలో భాగంగా బుధవారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయానికి వెళ్లగా.. కలెక్టర్‌ తన కుమారుడు నైతిక్‌ సత్పతి పేరును అంగన్‌వాడీ కేంద్రంలో నమోదు చేయించారు. 35 నెలల వయసున్న కలెక్టర్‌ కుమారుడికి అంగన్‌వాడీ టీచర్లు నెలకు సరిపడా బాలామృతం, 16 గుడ్లు అందజేశారు. నైతిక్‌ సత్పతికి 36 నెలలు నిండిన తర్వాత (మూడేళ్లు) అంగన్‌వాడీ కేంద్రానికి పంపనున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement