Obulapuram Mining Case Updates: TS HC Given Cleancheat For IAS Srilakshmi - Sakshi
Sakshi News home page

OMC Case: ఒబులాపురం మైనింగ్‌ కేసులో ఐఏఎస్‌ శ్రీలక్ష్మికి క్లీన్‌చిట్‌

Nov 8 2022 12:21 PM | Updated on Nov 8 2022 2:54 PM

Cleancheat For IAS Srilakshmi In Obulapuram Mining Case - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఓఎంసీ(ఒబులాపురం మైనింగ్‌) కేసులో ఐఏఎస్‌ శ్రీలక్ష్మికి క్లీన్‌చిట్‌ ఇచ్చింది తెలంగాణ హైకోర్ట్‌. ఐఏఎస్‌ శ్రీలక్ష్మికి క్లీన్‌చిట్‌ ఇస్తూ మంగళవారం హైకోర్ట్‌ ఆదేశాలు జారీ చేసింది. ఓఎంసీ కేసులో శ్రీలక్ష్మిపై అభియోగాలను కోర్టు కొట్టివేసింది.

కాగా, ఈ కేసులో శ్రీలక్ష్మి ఏడాది పాటు జైలులో ఉన్నారు. ఇక, 2004-09 వరకు శ్రీలక్ష్మి మైనింగ్‌ శాఖకు ప్రిన్సిపల్‌ సెక్రటరీగా ఉన్నారు. కాగా, ఈ కేసుకు సంబంధించి సీబీఐ.. ఆమెపై నేరారోపణకు సంబంధించిన సరైన వివరాలను కోర్టుకు అందించలేకపోయింది. కేవలం ఆరోపణలు మాత్రమే ఉండటంతో కోర్టు ఆమెకు క్లీన్‌చిట్‌ ఇచ్చింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement