
సాక్షి, ఢిల్లీ: మాజీ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఓబులాపురం మైనింగ్ కేసులో తెలంగాణ హైకోర్టు ఆర్డర్‌పై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఇదే సమయంలో ప్రతివాదులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
వివరాల ప్రకారం.. ఓబులాపురం మైనింగ్ కేసులో మాజీ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి.. తెలంగాణ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె పిటిషన్‌పై జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ ఎన్‌కే సింగ్ ధర్మాసనం విచారణ జరిపింది. అనంతరం, తెలంగాణ హైకోర్టు ఆర్డర్‌పై సుప్రీంకోర్టు స్టే విధించింది. హైకోర్టు విచిత్రమైన ఆర్డర్ ఇచ్చిందని వ్యాఖ్యానించింది. ఈ క్రమంలోనే ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఇదిలా ఉండగా.. అంతకుముందు ఓబులాపురం మైనింగ్ కేసులో శ్రీలక్ష్మి పేరు డిశ్చార్జ్ చేయడాన్ని తెలంగాణ హైకోర్టు కొట్టేసింది.
