అందంగా ముస్తాబైన చౌమహల్లా ప్యాలెస్‌

Chowmahalla Palace: Repair Work Finally Completed, Attracts Tourists - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: యూరోపియన్‌ శైలిలో నిర్మించిన శ్వేతసౌధం. అసఫ్‌ జాహీల పాలనకు నిలువుటద్దం పాతబస్తీలోని చౌమహల్లా ప్యాలెస్‌. రెండో నిజాం కాలంలో చార్మినార్‌– లాడ్‌బజార్‌కు అతి సమీపంలో నిర్మించిన చారిత్రక ప్యాలెస్‌ ఇది. 2020 జూన్‌ 27న ఖిల్వత్‌ క్రీడా మైదానం వైపు ఉన్న చౌమహల్లా ప్యాలెస్‌  ప్రహరీ పైభాగంలోని కిటికీ దిమ్మె కూలి కింద పడింది. సుమారు రెండేళ్ల పాటు కొనసాగిన మరమ్మతు పనులు ఎట్టకేలకు పూర్తయ్యాయి. (క్లిక్‌: చౌమహల్లా ప్యాలెస్‌ గురించి ఈ ఆసక్తికర విషయాలు)


ప్రస్తుతం ఈ ప్యాలెస్‌ అందంగా ముస్తాబై పర్యాటకులను ఆకట్టుకుంటోంది. టెహ్రాన్‌లోని షా ప్యాలెస్‌ ఆర్కిటెక్చర్‌ను పోలి ఉంది. 1912లో ఏడో నిజాం ప్యాలెస్‌కు చేయించిన మరమ్మతులతో మరింత శోభాయమానంగా మారింది. దాదాపు 2.90 లక్షల గజాల విస్తీర్ణంలో విశాలమైన ప్రాంగణంలో నిర్మితమైన ఈ ప్యాలెస్‌ ఒకప్పుడు నిజాంల నివాస గృహం. ప్రస్తుతం విద్యుద్దీపాలతో షాండిలియర్లు దేదీప్యమానంగా వెలుగుతూ చౌమహల్లా ప్యాలెస్‌కు మరింత శోభ తెస్తున్నాయి. (క్లిక్‌: సముద్రం పాలైన ‘హైదరాబాద్’ కరెన్సీ)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top