బీఆర్ఎస్ నేత అరెస్ట్.. కారణం ఇదే! | BRS Leader Nagarjuna Chary Arrest In Cyber Crime Case | Sakshi
Sakshi News home page

బీఆర్ఎస్ నేత అరెస్ట్.. కారణం ఇదే!

Nov 29 2024 9:34 AM | Updated on Nov 29 2024 1:30 PM

BRS Leader Nagarjuna Chary Arrest In Cyber Crime Case

సాక్షి, నల్లగొండ: సైబర్ మోసం కేసులో‌ మిర్యాలగూడకు చెందిన బీఆర్ఎస్ నేత అన్నభిమోజు నాగార్జున చారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబై కేంద్రంగా సాగుతున్న సైబర్ మోసాలతో నాగార్జునకు లింకులు ఉన్నట్టు గుర్తించారు. ఈ మోసాలకు దుబాయ్ నుంచి లింకులు ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

వివరాల ప్రకారం.. ముంబై కేంద్రంగా సాగుతున్న సైబర్ మోసాలతో మిర్యాలగూడకు చెందిన నాగార్జున చారికి‌ లింకు ఉన్నందన కారణంగానే ఆయనతో పాటు నాగేంద్రచారిని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. మిర్యాలగూడకు చెందిన కొందరి బ్యాంక్ అకౌంట్ల నుంచి లక్షల్లో నగదు బదిలీ అయినట్టు పోలీసులు గుర్తించారు. లావాదేవీలు జరిగిన బ్యాంకు ఖాతాదారులను అదుపులోకి తీసుకుని విచారించగా నాగార్జున చారి వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

అమాయకుల పేర్లపై బ్యాంకు అకౌంట్లు తెరిపించిన‌ నాగార్జున చారి. వారి ఖాతాల‌ ద్వారా నగదు బదిలీ చేయించి కమీషన్లు ఇస్తూ అందులో తాను వాటా తీసుకుంటున్నట్లు తెలిసింది. ఈ సైబర్ మోసానికి దుబాయ్ తో‌ సైతం లింకులు ఉన్నాయని సమాచారం. ఈ వ్యవహారంపై మూడు రోజులుగా సీసీఎస్ పోలీసుల విచారణ కొనసాగుతోంది. భారీగా నగదు బదిలీ అయినట్లు అధికారులు గుర్తించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement