సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం వద్ద పేలుడు

Blast Took Place At Muthyalamma Temple In Secunderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సికింద్రాబాద్ ముత్యాలమ్మ దేవాలయం వద్ద ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో స్థానికులు భయాందోళనలకు లోనయ్యారు. ముత్యాలమ్మ దేవాలయం వద్ద ఉన్న చెత్త కుప్పలో పెయింట్ డబ్బాను చెత్త ఎత్తుకునే వ్యక్తి ఓపెన్ చేసే ప్రయత్నం చేయగా, ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో అతడు గాయాలపాలయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించి, దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం అక్కడకు చేరుకున్న బాంబు స్క్వాడ్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించి టిన్నర్‌ డబ్బాగా తేల్చడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. (గ్రేటర్‌లో తీరొక్క దసరా)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top