బ్లాక్‌ ఫంగస్‌ అంటువ్యాధా.. డాక్టర్లు ఏమంటున్నారు?

Black Fungus Is A Spreading Disease, Here Is Clarity - Sakshi

అల్లూరు యూపీహెచ్‌సీ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ కుమార్‌

సాక్షి, రామగుండం: రాష్ట్రంలో కరోనా రెండో దశ రోజురోజుకు విజృంభిస్తున్న తరుణంలో వైరస్‌ కట్టడికి మాస్కులు ధరిస్తూ, భౌతిక దూరం పాటించాలి. అనవసరంగా బయట తిరగకుండా ఇంట్లోనే ఉండడం మంచిది’ అని యైటింక్లయిన్‌కాలనీ అల్లూరు అర్బన్‌ ప్రైమరీ హెల్త్‌ సెంటర్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ కుమార్‌ అన్నారు. పాజిటివ్‌ వచ్చినా ఆందోళన చెందకుండా మనోధైర్యంతో వైద్యుల సలహాలు, సూచనలు పాటించాలని పేర్కొన్నారు. అత్యవసరమైతే తప్ప ఆసుపత్రికి వెళ్లకుండా 14 రోజులు క్యారంటైన్‌లో ఉండాలంని తెలిపారు. ఈమేరకు ‘సాక్షి’కి పలు విషయం వివరించారు.

చదవండి: బ్లాక్‌ ఫంగస్‌ మహమ్మారే! 

ప్రశ్న: కరోనా సోకిన వ్యక్తి ముట్టుకున్న వస్తువులపై వైరస్‌ ఎన్ని రోజులు ఉంటుంది?
జవాబు: కరోనా సోకిన వ్యక్తి ముట్టుకున్న వస్తువులపై కరోనా వైరస్‌ 2–3 రోజులు మాత్రమే ఉంటుంది. శానిటైజేషన్‌ చేసి వాడుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు.

ప్రశ్న: బ్లాక్‌ ఫంగస్‌ అంటువ్యాధా..?
జవాబు: మ్యూకార్‌ మైకోసిస్‌ అనే ఫంగస్‌తో వచ్చేది బ్లాక్‌ ఫంగస్‌. ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి సోకదు.

ప్రశ్న: కరోనా సోకిన వ్యక్తికి దగ్గు ఎన్ని రోజుల వరకు ఉంటుంది.?
జవాబు: కరోనా నుంచి కోలుకున్నాక 14 రోజుల తర్వాత తిరిగి పరీక్ష అవసరం లేదు. మందులు వాడిన తర్వాత వైరస్‌ చనిపోయి వ్యక్తి శరీరంలో 3 నెలల వరకు ఉంటుంది. కాని దీని ద్వారా ఇతరులకు వైరస్‌ వ్యాప్తి చెందదు. అలాగే దగ్గు రెండుమూడు నెలల వరకు ఉండవచ్చు. దాని ప్రభావంతో ఆయాసం వస్తే వైద్యుల సూచనలు పాటిస్తూ మందులు వాడాలి.

ప్రశ్న: జ్వర సర్వేతో ఉపయోగం ఉందా..?
జవాబు:
జ్వర సర్వేతో చాలా ఉపయోగాలు ఉన్నాయి. కోవిడ్‌ లక్షణాలు ఉన్న వ్యక్తులను గుర్తించి వారికి ముందస్తు చికిత్స అందించే అవకాశం ఉంటుంది. వ్యక్తి పరిíస్థితిని బట్టి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి వెళ్లాలని సూచనలు ఇచ్చి ప్రాణపాయ íస్థితి నుంచి రక్షించవచ్చు. బాధితుల ఫోన్‌నంబర్‌ తీసుకొని వారికి అవసరమైన మందులతో పాటు సలహాలు, సూచనలు అందిస్తారు. ఫలితంగా ఇతరులకు వైరస్‌ సోకకుండా కట్టడి చేసే అవకాశం చాలా ఉంటుంది. జ్వర సర్వేకు ప్రజలందరూ  సహకరించాలి.

ప్రశ్న: కరోనా సోకిన వ్యక్తి ముట్టుకున్న వస్తువులపై వైరస్‌ ఎన్ని రోజులు ఉంటుంది?
జవాబు: కరోనా సోకిన వ్యక్తి ముట్టుకున్న వస్తువులపై కరోనా వైరస్‌ 2–3 రోజులు మాత్రమే ఉంటుంది. శానిటైజేషన్‌ చేసి వాడుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు.

ప్రశ్న: బ్లాక్‌ ఫంగస్‌ అంటువ్యాధా..?
జవాబు:
మ్యూకార్‌ మైకోసిస్‌ అనే ఫంగస్‌తో వచ్చేది బ్లాక్‌ ఫంగస్‌. ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి సోకదు.

ప్రశ్న: కరోనా సోకిన వ్యక్తికి దగ్గు ఎన్ని రోజుల వరకు ఉంటుంది.?
జవాబు: కరోనా నుంచి కోలుకున్నాక 14 రోజుల తర్వాత తిరిగి పరీక్ష అవసరం లేదు. మందులు వాడిన తర్వాత వైరస్‌ చనిపోయి వ్యక్తి శరీరంలో 3 నెలల వరకు ఉంటుంది. కాని దీని ద్వారా ఇతరులకు వైరస్‌ వ్యాప్తి చెందదు. అలాగే దగ్గు రెండుమూడు నెలల వరకు ఉండవచ్చు. దాని ప్రభావంతో ఆయాసం వస్తే వైద్యుల సూచనలు పాటిస్తూ మందులు వాడాలి.

ప్రశ్న: జ్వర సర్వేతో ఉపయోగం ఉందా..?
జవాబు:
జ్వర సర్వేతో చాలా ఉపయోగాలు ఉన్నాయి. కోవిడ్‌ లక్షణాలు ఉన్న వ్యక్తులను గుర్తించి వారికి ముందస్తు చికిత్స అందించే అవకాశం ఉంటుంది. వ్యక్తి పరిíస్థితిని బట్టి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి వెళ్లాలని సూచనలు ఇచ్చి ప్రాణపాయ స్థితి నుంచి రక్షించవచ్చు. బాధితుల ఫోన్‌నంబర్‌ తీసుకొని వారికి అవసరమైన మందులతో పాటు సలహాలు, సూచనలు అందిస్తారు. ఫలితంగా ఇతరులకు వైరస్‌ సోకకుండా కట్టడి చేసే అవకాశం చాలా ఉంటుంది. జ్వర సర్వేకు ప్రజలందరూ  సహకరించాలి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top