వీధి కుక్కకు చికిత్స కోసం బీదర్‌ నుంచి సిటీకి..

From Bidar To City For The Treatment Of Stray Dog - Sakshi

సాక్షి, బంజారాహిల్స్‌:  నగరానికి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న బీదర్‌లో ఓ వీధి కుక్క నడవలేని పరిస్థితుల్లో ఉందని.. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నట్లు ఇక్కడి యానిమల్‌ వారియర్స్‌ కన్జర్వేషన్‌ సొసైటీ(ఏడబ్లూసీఎస్‌)కు ఈ నెల 21వ తేదీన ఫోన్‌ వచ్చింది. దీంతో ఈ సంస్థకు చెందిన షెల్టర్‌ నిర్వాహకులు సంతోషినాయర్, రెస్క్యూ కో ఆర్డినేటర్లు మనీష్‌, గణేష్‌ తదితరులు తమ సంస్థకు చెందిన రెస్క్యూ అంబులెన్స్‌లో బీదర్‌ చేరుకున్నారు.

అక్కడ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న వీధి కుక్కను అంబులెన్స్‌లో హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. అల్వాల్‌ మిలటరీ డెయిరీఫామ్‌ రోడ్డులో ఉన్నో ఆంచల్‌ ఖన్నా జంతు సంరక్షణ కేంద్రానికి తీసుకొచ్చి రెండు రోజుల పాటు వైద్యం చేయించారు.  శుక్రవారం మెడలో ఇరుక్కున్న ప్లాస్టిక్‌ పైప్‌ను సర్జరీ ద్వారా తొలగించారు.  జంతు ప్రేమికులు ఈ బృందంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.    

(చదవండి: పనసపొట్టు.. షుగర్‌ ఆటకట్టు)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top