బెంగళూరు: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. వ్యాను, కారు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు తెలంగాణ వాసులు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలైనట్టు తెలుస్తోంది.
వివరాల ప్రకారం.. కర్ణాటకలోని బీదర్‌లో బుధవారం ఉదయం డీటీడీసీ కొరియర్ వ్యాను, కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడటంతో వారికి ఆసుపత్రికి తరలించారు. మృతులు నారాయణఖేడ్ మండలం జగన్నాథ్‌పూర్ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. వీరంతా గణగాపూర్ దత్తాత్రేయ ఆలయానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగినట్టు సమాచారం.


