సీతారామ కల్యాణం.. కమనీయం

Bhadrachalam Seetharamula Kalyanam 2023 Updates - Sakshi

సాక్షి, భద్రాద్రి: భద్రాచలం  శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో.. సీతారామకల్యాణ మహోత్సవం వైభవంగా జరుగుతోంది. అభిజిత్‌ లగ్నముహూర్తాన మాంగల్యధారణ జరిగింది. భద్రాద్రి నుంచి ప్రత్యక్ష ప్రసారం.. 

తెలంగాణ ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు,ముత్యాల తలంబ్రాలు సమర్పించారు మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి. 

► ప్రతీ ఏడాది కంటే ఈసారి భిన్నంగా శ్రీరామ నవమి వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈసారి సువర్ణ ద్వాదశ వాహనాలపై సీతారాముల్ని ఊరేగించారు. భక్తరామదాసు కాలంలో ఇలా సువర్ణ ద్వాదశ ఊరేగింపు కార్యక్రమం జరిగింది.

భద్రాద్రి సీతారాముల కళ్యాణం కోసం లక్ష మందికి పైగా భక్తులు హాజరుకానున్నట్లు అంచనా. అందుకు తగ్గట్లే ఉదయం నుంచి భక్తుల రద్దీ క్రమంగా పెరుగుతోంది.

మిథిలా స్టేడియంలో జరగనున్న సీతారామా కల్యాణం కోసం.. రామ భక్త జనసంద్రం తరలి వచ్చింది.

► కల్యాణం వీక్షించేందుకు వీఐపీతో పాటు 26 సెక్టార్లు.. ఎల్ఈడి తెర లు ఏర్పాటు చేశారు. 

► చిన్నజీయర్‌ స్వామి ఇతర ప్రముఖులు కల్యాణ మహోత్సవానికి హాజరయ్యారు. 

► భక్తులకు మూడు లక్షల మంచినీరు ,లక్ష మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ కి సిద్దం చేశారు.

► భక్తులకు అందుబాటులో రెండు లక్షల లడ్డు ప్రసాదాలు, 200 క్వింటాల తలంబ్రాలు.. వాటి పంపిణీకి 70 కౌంటర్స్ ఏర్పాటు చేశారు. 

► మొదట గర్భగుడిలో రామయ్య మూలవిరాట్‌కు లఘుకల్యాణం నిర్వహిస్తారు.

► ఆపై అభిజిత్‌ లగ్నంలో వేలాది మంది భక్తుల నడుమ మధ్యాహ్నం 12 గంటల సమయంలో కల్యాణం జరగనుంది.  

► రేపు(శుక్రవారం) స్వామివారికి పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం నిర్వహించనున్నారు.

భద్రాద్రి రాములోరి కల్యాణాన్ని వీక్షించడానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భద్రాదికి తరలివచ్చారు భక్తులు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top