
భద్రాద్రి జిల్లా దంపతుల కుమారుడికి నామకరణం చేసిన కేటీఆర్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గానికి చెందిన లావణ్య, రాంబాబు దంపతులు తమ కుమారుడికి పేరు పెట్టాలని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వద్దకు తమ బిడ్డను తీసుకువచ్చారు. బాబుకు ఏ అక్షరంతో పేరు పెట్టాలని కేటీఆర్ అడిగినప్పుడు, ’సు’అనే అక్షరంతో పేరుపెట్టాలని బ్రాహ్మణులు సూచించిన విషయాన్ని ఆ దంపతులు కేటీఆర్‌కు తెలియజేశారు. దీంతో ‘సూర్యాంశ్’అనే పేరును ఆ చిన్నారికి కేటీఆర్ పెట్టారు. తమ కుమారుడికి కేటీఆర్ పెట్టిన పేరు ఆయన కుమారుడు హిమాన్షు లాగా ధ్వనిస్తుండటంతో దంపతులు సంతోషిచారు. తమ అభిమాన నేతతో గడిపిన ఈ క్షణాలను జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేమని వారు భావోద్వేగంతో చెప్పారు. ఈ సందర్భంగా కేటీఆర్ వారికి ‘కేసీఆర్ కిట్’ను బహూకరించారు.