ఆర్డీవో సాక్షిగా అన్నంలో పురుగులు

Basara IIIT College Students Identify Spider In Mess Meal In Nirmal District - Sakshi

ట్రిపుల్‌ ఐటీలో మూడో రోజు పెరుగన్నంలో సాలెపురుగు

బాసర(ముధోల్‌): నిర్మల్‌ జిల్లా బాసర ట్రిపుల్‌ఐటీలో మెస్‌ నిర్వహణ తీరు అధ్వానంగా మారింది. విద్యార్థులకు అందించే బ్రేక్‌ఫాస్ట్, భోజనంలో మొన్న కప్ప, నిన్న బొద్దింక కనిపించగా... నేడు సాలెపురుగు వచ్చింది. మూడు రోజులుగా విద్యార్థులకు కలుషిత ఆహారం సర్వ్‌ అవుతూనే ఉంది. మొదటిరోజు ఆలూ కూర్మతో కప్పను, రెండో రోజు పప్పుసాంబారుతో బొద్దింకలని వడ్డించారు శక్తి మెస్‌ నిర్వాహకులు.

మీడియాలో వరుస కథనాలతో సీరియస్‌ అయిన సర్కార్‌... మెస్‌ నిర్వహణపై కలెక్టర్‌ విచారణకు ఆదేశించింది. ఆర్డీవో లోకేశ్‌ కుమార్, ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రత్యూష ట్రిపుల్‌ ఐటీలో సోమవారం పర్యటించి మెస్‌లో భోజనం తీరును పరిశీలించారు. శాంపిల్స్‌ను సేకరించి నాచారంలోని ల్యాబ్‌కు పంపించారు. ఆర్డీవో పరిశీలన కొనసాగుతున్న సమయంలో సైతం విద్యార్థులకు వడ్డిస్తున్న అన్నంలో పురుగులు రావడం తీవ్ర దుమారం రేపింది. వరుసగా కలుషిత ఆహారాన్నే పెడుతున్నా... క్యాంటీన్‌ నిర్వహిస్తున్న శక్తి మెస్‌పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top