డ్రగ్స్‌ రహిత తెలంగాణనే లక్ష్యం: సీఎం రేవంత్‌రెడ్డి | Anti Drug Day: Drug awareness Programme In Hyderabad | Sakshi
Sakshi News home page

డ్రగ్స్‌ రహిత తెలంగాణనే లక్ష్యం: సీఎం రేవంత్‌రెడ్డి

Jun 26 2025 6:39 PM | Updated on Jun 26 2025 10:10 PM

Anti Drug Day: Drug awareness Programme In Hyderabad

హైదరాబాద్‌:  యువత డ్రగ్స్‌కు బానిస అయితే దేశ మనుగడ కష్టమని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. యువతను సరైన మార్గంలో పెట్టేందుకు స్పోర్ట్స్‌ పాలసీని తెచ్చామన్నారు. ఈరోజు(గురువారం, జూన్‌ 26) యాంటీ డ్రగ్‌ డేలో భాగంగా హైదరాబాద్‌ శిల్పకళావేదికలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్‌ మాట్లాడారు. తెలంగాణకు గొప్ప చరిత్ర ఉందని, తెలంగాణ ఉద్యమ చరిత్ర ప్రపంచానికి స్ఫూర్తి అని పేర్కొన్నారు. మరి అటువంటి తెలంగాణను డ్రగ్స్‌ రహిత తెలంగాణగా మార్చాలనేదే తమ లక్ష్యమన్నారు సీఎం రేవంత్‌. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు ప్రముఖులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

సే నో టు డ్రగ్స్‌.. సే యస్‌ టు స్పోర్ట్స్‌ : పుల్లెల గోపీచంద్‌
సే నో టు డ్రగ్స్‌కు స్వస్థి చెప్పి.. సే యస్‌ టు స్పోర్ట్స్‌కి నాంది పలికాలన్నారు బ్యాడ్మింటన్‌ దిగ్గజం పుల్లెల గోపీచంద్‌. ‘తెలంగాణలో స్పోర్ట్స్ కి చాలా సపోర్ట్ చేస్తున్నందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ఒక్కసారి అనే ట్రైల్  ఎప్పుడూ వేయకండి. నా జీవితంలో ఒక్కసారి కూడా తప్పు బాటలో లేను’ అని తెలిపారు.

ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నా సరే చట్ట రీత్యా నేరమే..
డ్రగ్స్‌ను సేవించడమే కాదు.. డ్రగ్స్‌ను తీసుకున్నా నేరమేనన్నారు టీజీఎన్‌ఏబీ డైరెక్టర్‌ సందీప్‌ శాండిల్య.  ఒక్క గోవా లోనే ఒక్కో హవాలా ఆపరేటర్ 2 రోజుల్లో 50 లక్షల విలువ చేసే డ్రగ్స్ ను అమ్ముతున్నారు. గతం లో డ్రగ్స్ కన్స్యూమర్లకు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపే వాళ్ళం, కానీ పాలసీ లో మార్పులు తెస్తున్నామన్నారు. డ్రగ్స్ తీసుకుంటే కస్టడీకి తీసుకుని మేజిస్ట్రేట్ ముందు హాజరు పరుస్తాము. కన్స్యూమర్లును డి అడిక్షన్ సెంటర్లకు తరలిస్తాం’ అని తెలిపారు.

రైజింగ్ తెలంగాణ స్పూర్తినిస్తుంది: రామ్ చరణ్
కొన్ని సంవత్సరాలు క్రితం స్కూల్స్ బయట డ్రగ్స్ అమ్ముతున్నారనీ విన్నాను. 2014 లో 3, 4 క్లాస్ చదివే పిల్లలకు ఐస్ క్రీమ్ లలో డ్రగ్స్ ఇచ్చారని తెలిసి పేరెంట్స్ ధర్నాలు చేశారు. డ్రగ్స్ అంత డీప్ గా వెళ్లిపోయాయి. ఫిజికల్ వర్క్ అవుట్, ఒక షూటింగ్, కుటుంబంతో క్వాలిటీ టైమ్, స్పోర్ట్స్ ఒక రోజుకి ఇది చాలు. పిల్లలని స్కూల్స్ కు పంపాలంటే భయమేసే పరిస్థితులు ఉండకూడదు.. డ్రగ్స్ నిర్మూలనకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు చాలా బావున్నాయి. ప్రభుత్వానికి ఇలాంటి మంచి కార్యక్రమంలో  మా  తోడ్పాటు ఉంటుంది’ అని రామ్‌చరణ్‌ తెలిపారు.

ఒక దేశాన్ని నాశనం చేయాలి అంటే వార్ అవసరం లేదు: విజయ్ దేవరకొండ
ఒక దేశాని నాశనం చేయాలి అంటే వార్ అవసరం లేదని, యువతకు డ్రగ్స్‌ అలవాటు చేస్తే చాలని సినీ హీరో విజయ్‌ దేవరకొండ తనదైన శైలిలో చెప్పుకొచ్చారు.కొన్ని దేశాలు యువతకు మత్తు అలవాటు చేసి దేశ భవిషత్ నీ నాశనం చేయాలి అనుకుంటున్నారు. డ్రగ్స్ మన జీవితాల్ని నాశనం చేస్తాయి. ఒక్కసారి డ్రగ్స్ కి అలవాటు పడితే కోలుకోవడం కష్టం. డ్రగ్స్ అలవాటు చేసే వారికి దూరంగా ఉండండి. డ్రగ్స్ కి దూరంగా ఉంటూ ఆరోగ్యంగా ఉండండి

డ్రగ్స్‌ తీసుకుంటే ఇండస్ట్రీ నుంచి బహిష్కరిస్తాం: దిల్‌రాజు
ఇక మీదట ఎవరైనా డ్రగ్స్‌ తీసుకున్న సినిమా రంగానికి చెందిన వారిని  ఇండస్ట్రీ నుంచి బహిష్కరించేలా చర్యలు తీసుకుంటామని నిర్మాత దిల్‌ రాజ్‌ స్పష్టం చేశారు. ఇప్పటికే మలయాళం ఫిలిం ఇండస్ట్రీ లో డ్రగ్స్ తీసుకునే వారిని ఇండస్ట్రీ నుండి బహిష్కరిస్తున్నారని, ఇక్కడ కూడా త్వరలో అలాంటి నిర్ణయం తీసుకుంటామన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement