చీమలపాడు దుర్ఘటనలో మరొకరు మృతి | Sakshi
Sakshi News home page

<script>
document.addEventListener("DOMContentLoaded", function() {
 var newsContent = document.querySelector(".news-story-content");
    var paragraphs = Array.from(newsContent.querySelectorAll("p"));
 
  var firstParagraph = paragraphs.find(function(paragraph) {
       return !paragraph.closest('.bullet_list');
   });
  if (firstParagraph.length > 1) {
   var secondParagraph = firstParagraph[1];

 var script = document.createElement("script");
 script.async = true;
 script.id = "AV62ff84d96d945e7161606a7a";
 script.type = "text/javascript";
 script.src = "https://tg1.playstream.media/api/adserver/spt?AV_TAGID=62ff84d96d945e71…";
 
 secondParagraph.parentNode.insertBefore(script, secondParagraph.nextSibling);
}
});
</script>

చీమలపాడు దుర్ఘటనలో మరొకరు మృతి

Published Sat, Apr 15 2023 2:47 AM

Another person died in chimalapadu Cylinder Blast accident - Sakshi

కారేపల్లి: ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులో ఈ నెల 12న బీఆర్‌ఎస్‌ ఆత్మీ య సమ్మేళనం సందర్భంగా బాణాసంచా కాల్చే క్రమంలో సిలిండర్‌ పేలిన ఘటనలో మృతులసంఖ్య నాలుగుకు చేరింది. ఘటన జరిగిన రోజే ముగ్గురు మృతి చెందగా, రెండుకాళ్లు కోల్పోయి తీవ్రంగా గాయపడిన చిందివారి సందీప్‌(36) హైదరాబాద్‌ నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. అతడికి భార్య మమత అలియాస్‌ మొమీన్, నాలుగేళ్ల కుమారుడు ఉన్నారు.

మహారాష్ట్రలోని చంద్రాపూర్‌ జిల్లా సిందేయి తాలూకా మింగరి గ్రామానికి చెందిన చిందివారి సందీప్‌ బతుకుదెరువు కోసం పదిహేనేళ్ల క్రితం తెలంగాణకు వచ్చాడు. తల్లిదండ్రులు, సోదరి పోషణ బాధ్యతలు సందీప్‌ చూసు కుంటున్నాడు. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో సందీప్‌ సుతారీ పనులు చేసే క్రమంలో ఒడిశా ప్రాంతానికి చెంది మొమీన్‌ పరిచయం కావటంతో ఏడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి నాలుగేళ్ల కుమారుడు కృష్ణ ఉన్నాడు.

ఏడాది క్రితం పొట్ట చేతపట్టుకొని కారేపల్లి మండలం చీమలపాడుకు సందీప్, మొమీన్‌ వచ్చారు. భార్య గ్రామంలో వ్యవసాయకూలీ పనులకు వెళ్తుండగా, సందీ ప్‌ సుతారీ పనులు చేసేవాడు. ఈ నెల 12న మొమీన్‌ మిర్చి తోటలో పనికి వెళ్లగా, గ్రామంలో జరిగిన బీఆర్‌ఎస్‌ సమావేశానికి సందీప్‌ హాజరయ్యాడు. ఆరోజు గుడిసె కాలి పోతుండటంతో అందరితోపాటు మంటలు ఆర్పే క్రమంలో సిలిండర్‌ శకలాలు దూసుకురావడంతో సందీప్‌ రెండు కాళ్లు నుజ్జునుజ్జయ్యాయి. తొలుత ఖమ్మం ప్రభు త్వ ఆస్పత్రికి, తర్వాత నిమ్స్‌కు తరలించగా శుక్రవారం మృతి చెందాడు. ఊరుగాని ఊరిలో భర్తను కోల్పోయిన మొమీన్‌ కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.

Advertisement
Advertisement