తెలంగాణలో 79వేలు దాటిన కరోనా కేసులు | 1982 New Coronavirus Cases Recorded In Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణలో 79వేలు దాటిన కరోనా కేసులు

Aug 9 2020 8:55 AM | Updated on Aug 9 2020 11:48 AM

1982 New Coronavirus Cases Recorded In Telangana  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1982 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ఆదివారం వైద్యారోగ్యశాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో  మొత్తం కరోనా కేసుల సంఖ్య 79,495కు చేరుకుంది. కరోనా నుంచి కొత్తగా 1669 మంది డిశ్చార్జ్‌ కాగా.. ఇప్పటివరకు కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న వారి సంఖ్య 55,999గా ఉంది. కరోనాతో మరో 12 మంది మృతి చెందగా.. రాష్ట్రంలో మరణాల సంఖ్య 627కు పెరిగింది. ప్రస్తుతం తెలంగాణలో 22,869 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో 463, మేడ్చల్ జిల్లా 141, రంగారెడ్డి జిల్లా 139, వరంగల్ అర్బన్ జిల్లా  71, కరీంనగర్ జిల్లా 96 కరోనా కేసులు నమోదయ్యాయి. కాగా శనివారం 22,925 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. ఇప్పటివరకు రాష్ట్రంలో 6,13,231 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. తెలంగాణలో రికవరీ రేటు 70.44 శాతంగా ఉంది. కాగా జాతీయస్థాయిలో రికవరీ రేటు 68.32శాతం ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement