వివేకా కేసు: కోర్టుకు హాజరుకాని దస్తగిరి.. విచారణ వాయిదా  | YS Viveka Murder Case Trail Has Been Postponed To June 16 | Sakshi
Sakshi News home page

వివేకా కేసు: కోర్టుకు హాజరుకాని దస్తగిరి.. విచారణ వాయిదా 

Jun 2 2023 1:05 PM | Updated on Jun 2 2023 1:52 PM

YS Viveka Murder Case Trail Has Been Postponed To June 16 - Sakshi

(ఫైల్‌ ఫోటో)

సాక్షి, హైదరాబాద్‌: వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వివేకా హత్య కేసులో ఉన్న ఐదుగురు నిందితులను సీబీఐ అధికారులు కోర్టు ముందు హాజరుపరిచారు. ఎర్రగంగిరెడ్డి, సునీల్‌ యాదవ్‌, ఉమాశంకర్‌ రెడ్డి, శివశంకర్‌ రెడ్డిని హాజరుపరిచారు. 

అయితే, వివేకా కేసులో కీలక నిందితుడు దస్తగిరి ఈరోజు కూడా కోర్టులో హాజరు కాలేదు. దీంతో, కోర్టు.. కేసు విచారణను ఈనెల 16వ తేదీకి వాయిదా వేసింది. ఇదిలా ఉండగా..  వైఎస్‌ భాస్కర్‌ రెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై నాంపల్లి సీబీఐ కోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ఈ క్రమంలో కౌంటర్‌ దాఖలు చేయాలని సీబీఐకి కోర్టు ఆదేశించింది. అనంతరం విచారణను జూన్‌ 5వ తేదీకి వాయిదా వేసింది. 

ఇది కూడా చదవండి: వైఎస్‌ భాస్కర్‌ రెడ్డి బెయిల్‌ పిటిషన్‌ విచారణ వాయిదా

Advertisement
 
Advertisement
Advertisement