Sejal Moves To CBI Against MLA Durgam Chinnaiah - Sakshi
Sakshi News home page

తెలంగాణ పోలీసులు పట్టించుకోవట్లేదు: సీబీఐకి శేజల్‌ ఫిర్యాదు

Jun 12 2023 3:46 PM | Updated on Jun 12 2023 4:52 PM

Sejal Moves To CBI Against MLA Durgam Chinnaiah - Sakshi

ఢిల్లీ: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తనను లైంగికంగా వేధించాడంటూ ఆరోపణలు చేసిన శేజల్‌ అనే యువతి.. ఈసారి కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐని ఆశ్రయించింది. దుర్గం చిన్నయ్యపై ఫిర్యాదు చేసినా తెలంగాణ పోలీసులు పట్టించుకోవడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ సీబీఐకి ఫిర్యాదు చేసింది. ఇప్పటికైనా ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై కేసు నమోదు చేయాలని సీబీఐని కోరింది. 

ఇటీవల దుర్గం చిన్నయ్య తనను లైంగికంగా వేధించాడంలూ జాతీయ మహిళా కమిషన్‌కు సైతం శేజల్‌ ఫిర్యాదు చేసింది. అయితే రోజుల వ్యవధిలోనే సీబీఐని ఆశ్రయించిన ఆమె.. తెలంగాణ పోలీసులు తన ఫిర్యాదును పట్టించుకోవట్లేదని తెలిపింది. 

ఇటీవల జాతీయ మహిళా కమిషన్‌కు సైతం ఆమె ఫిర్యాదు చేసింది. దీంతో, జాతీయ మహిళా కమిషన్‌ స్పందిస్తూ తెలంగాణ డీజీపీకి లేఖ రాసింది. ఈ క్రమంలో శేజల్‌ ఫిర్యాదుపై విచారణ జరపాలని ఆదేశించింది. లైంగిక ఆరోపణలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని లేఖలో ఆదేశించింది. ఇక, 15 రోజుల్లో దీనిపై అప్‌డేట్‌ ఇవ్వాలని కమిషన్‌ లేఖలో పేర్కొంది. 

కాగా, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తనను లైంగిక వేధింపులకు గురిచేశాడని శేజల్‌ అనే యువతి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎమ్మెల్యే వేధింపులకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని ఇప్పటికే పేర్కొంది.  అందుకు సంబంధించిన ఓ వీడియో, ఫొటోను శేజల్‌ విడుదల చేసింది. 

దుర్గం చిన్నయ్యపై ఆరోపణలు.. వీడియో, ఫొటో రిలీజ్‌ చేసిన శేజల్‌

దుర్గం చిన్నయ్యకు షాక్‌!.. డీజీపీకి మహిళా కమిషన్‌ లేఖ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement