ఎస్‌ఎస్‌ఆర్‌పై వాకౌట్‌! | - | Sakshi
Sakshi News home page

ఎస్‌ఎస్‌ఆర్‌పై వాకౌట్‌!

Oct 24 2026 4:59 AM | Updated on Oct 24 2026 4:59 AM

ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేష్‌కుమార్‌ రాజీనామా చేయాలి

సర్‌లో తొలగించిన ఓటర్లను తిరిగి చేర్చాలి

తొమ్మిది పార్టీల నేతల డిమాండ్‌

సమావేశంలో అన్నాడీఎంకే, బీజేపీ హాజరు

సాక్షి, చైన్నె: స్పెషల్‌ సమ్మరీ రివిజన్‌ (ఎస్‌ఎస్‌ఆర్‌) నిర్వహణ సమావేశాన్ని రాజకీయ పార్టీలు వాకౌట్‌ చేశాయి. అధికార టీవీకే ప్రధాన ప్రతిపక్షం డీఎంకే సహా తొమ్మిది పార్టీలు ఎన్నికల కమిషన్‌ సమావేశం నుంచి వాక్‌ అవుట్‌ చేసి బయటకు వచ్చేశాయి. అన్నాడీఎంకే, బీజేపీ తదితర కొన్ని పార్టీలు మాత్రమే హాజరయ్యాయి. సచివాలయంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అర్చనా పట్నాయక్‌ అధ్యక్షతన శుక్రవారం ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణపై అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్య ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేష్‌ కుమార్‌ రాజీనామా చేయాలని, ఓటర్ల జాబితా సవరణలో జరిగిన అవకతవకలను నిరసిస్తూ డీఎంకే, కాంగ్రెస్‌, సీపీఎం, సీపీఐ, వీసీకే, ఎస్పీ, ఆప్‌ వంటి 9 ప్రధాన రాజకీయ పార్టీలు సమావేశం నుంచి వాకౌట్‌ చేశాయి.

ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌

భారత ఎన్నికల సంఘం 2027 జనవరి 1 అర్హత తేదీగా ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ ( pe-c-i-al um-m-ar y Qe-v-ir-io n) నిర్వహించేందుకు షెడ్యూల్‌ను జారీ చేసింది. ఈ సమావేశానికి హాజరుకావాలని తమిళనాడులోని అన్ని గుర్తింపు పొందిన పార్టీలకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అర్చన పట్నాయక్‌ ఆహ్వానం పంపించారు. ఈ మేరకు ఆయా పార్టీల తరఫున ప్రతినిధులు శుక్రవారం సచివాలయానికి వచ్చారు. సమావేశం జరిగిన ప్రదేశానికి కూడా వచ్చారు. డీఎంకే తరఫున ఎమ్మెల్యే పరంధామన్‌, బీజేపీ తరపున కరాటే త్యాగరాజన్‌, వీసీకే నుంచి ఎస్‌ఎస్‌.బాలాజీ, డీఎండీకే నుంచి పార్థసారథి, టీవీకే నుంచి మంత్రి నిర్మల్‌ కుమార్‌, అన్నాడీఎంకే తరఫున డి.జయకుమార్‌, ఇతర పార్టీల తరఫున మరికొందరు ప్రతినిధులు హాజరయ్యారు. సమావేశం ప్రారంభంకాగానే ఒకరి తర్వాత మరొకరు వాకౌట్‌ చేసి బయటకు వచ్చేశారు. 9 పార్టీలు నిరసన తెలిపి వాకౌట్‌ చేయడడంతో సమావేశంలో అన్నా డీఎంకే, బీజేపీ, నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ ప్రతినిధులు మాత్రమే ఉన్నారు.

ప్రధాన డిమాండ్‌

భారత ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేష్‌ కుమార్‌ రాజీనామా చేయాలని వాకౌట్‌ చేసిన పార్టీలు పట్టుబట్టాయి. ఆయన రాజీనామా చేయకుండా, జాబితాలో జరిగిన తప్పులను సరిదిద్దకుండా ఈ ప్రత్యేక సవరణ ప్రక్రియను కొనసాగించడం సరైంది కాదని స్పష్టం చేశాయి. వాకౌట్‌కు గల కారణాలను డీఎంకే నేత పరంధామన్‌ వివరిస్తూ గతంలో జరిగిన ప్రత్యేక సవరణ సమయంలో దాదాపు 74 లక్షలకు పైగా ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించారని గుర్తు చేశారు. తొలగించిన అర్హులైన ఓటర్లను తిరిగి జాబితాలో చేర్చడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో ఎన్నికల సంఘం స్పష్టం చేయలేదని తెలిపారు. ఓటర్ల జాబితా సవరణలోని అవకతవకలకు బాధ్యత వహిస్తూ ఎన్నికల కమిషన్‌ సరైన సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేస్తూ బయటకు వచ్చేశామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement