డ్రగ్‌ ఫ్రీ ఇండియానే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

డ్రగ్‌ ఫ్రీ ఇండియానే లక్ష్యం

Oct 17 2026 3:03 AM | Updated on Oct 17 2026 3:03 AM

●కుమరి నుంచి చైన్నెకు రాక

సాక్షి,చైన్నె: మాదకద్రవ్య రహిత భారతదేశాన్ని ఆకాంక్షిస్తూ, కేంద్ర ప్రభుత్వ నషా ముక్త్‌ భారత్‌ అభియాన్‌ పిలుపులో భాగంగా కాటాన్‌ కొళత్తూరులో శుక్రవారం ది ఫిజియో రన్‌ నిర్వహించారు. ఎస్‌ఆర్‌ఎం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ క్యాంపస్‌లో కాలేజ్‌ ఆఫ్‌ ఫిజియోథెరపీ ఆధ్వర్యంలో 6వ ఎడిషన్‌గా ఈ రన్‌ జరిగింది. కన్యాకుమారి నుంచి ప్రారంభమైన ఈ నాన్‌–స్టాప్‌ రిలే పరుగు కాటాన్‌ కొళత్తూరు వరకు మొత్తం 700 కిలోమీటర్ల మేర కొనసాగింది. ఇందులో 66 మంది రన్నర్లు చురుగ్గా పాల్గొన్నారు. ఈ భారీ పరుగును కన్యాకుమారి జిల్లా కలెక్టర్‌ ప్రతాప్‌, నాగర్‌కోయిల్‌ అదనపు ఎస్పీ, ఇతర ప్రభుత్వ అధికారులు జెండా ఊపి ప్రారంభించారు. పరుగు సాగిన మార్గంలో వివిధ ప్రాంతాలలోని పాఠశాలలకు చెందిన 4,000 మందికి పైగా విద్యార్థులు పాల్గొని, మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు.

కాటాన్‌ కొళత్తూరులో ముగింపు సభ

ఎస్‌ఆర్‌ఎం వైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ సి.ముత్తమిసైసెల్వన్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ పరుగు ఉద్దేశం క్రీడా సామర్థ్యాన్ని చాటుకోవడమే కాదని, సమాజానికి ఒక మంచి సామాజిక సందేశాన్ని అందించి, ప్రజల్లో అవగాహన పెంచడమే లక్ష్యమని తెలిపారు. కాలేజ్‌ ఆఫ్‌ ఫిజియోథెరపీ డీన్‌ ప్రొఫెసర్‌ టి.ఎస్‌.వీరగౌధమన్‌ మాట్లాడుతూ ఫిజియో రన్‌ తాజాగా ముగిసి ఉండవచ్చని, మాదకద్రవ్య రహిత సమాజం కోసం చేపట్టిన సామాజిక బాధ్యత ఇక్కడితో ఆగదన్నారు. ఈ పరుగు అందించిన సందేశాన్ని సమాజంలో ప్రతి ఒక్కరికీ చేరవేయాలని పిలుపునిచ్చారు. ఈ వేడుకలో భాగంగా ప్రత్యేక వీడియో ప్రదర్శనతో పాటు, పుస్తకం ఆవిష్కరించారు. 700 కి.మీ సుదీర్ఘ పరుగును దిగ్విజయంగా పూర్తి చేసిన బృందాన్ని సత్కరించారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ టి.ఎన్‌.సురేష్‌, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ డాక్టర్‌ ఎస్‌.ఎఫ్‌.మరియం ఫర్జానా, అధ్యాపక బృందం పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement