– ఎం.కె. స్టాలిన్ విమర్శలు
సాక్షి, చైన్నె : తమిళనాడులో తరచూ జరుగుతున్న విద్యుత్ కోతలు , అధికారిక కార్యక్రమాల్లో విద్యుత్ అంతరాయాలు ఏర్పడుతుండటంపై డీఎంకే అధ్యక్షుడు ఎం.కె. స్టాలిన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సీఎం విజయ్ విద్యుత్ బోర్డు కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష కేవలం ప్రచారం కోసం తీసిన ‘రీల్స్‘ నాటకం అని ఆయన ఎద్దేవా చేశారు.
మంత్రులకే ఆ గతి అయితే..
తమిళనాడు ప్రభుత్వంలో మంత్రులు పాల్గొనే అధికారిక కార్యక్రమాల్లోనే పదే పదే విద్యుత్ అంతరాయాలు ఏర్పడుతున్నాయని, అలాంటిది ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదని స్టాలిన్ ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రోజుల క్రితం సీఎం విద్యుత్ బోర్డు ప్రధాన కార్యాలయంలో సమీక్ష నిర్వహించినట్లు చెబుతున్నప్పటికీ, అది క్షేత్రస్థాయి సమస్యలను పరిష్కరించే సమీక్షలా లేదని, కేవలం సోషల్ మీడియాలో రీల్స్ తీసుకోవడానికి చేసిన ఒక నాటకంలా ఉందని ఆయన తన ఎక్స్‌పేజీలో తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రంలో విపరీతంగా పెరుగుతున్న విద్యుత్ కోతల సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని స్టాలిన్ ఈ సందర్భంగా ఆరోపించారు.
ఎట్టకేలకు.. మోక్షం!
– అక్టోబర్ 11న పూందమల్లి–వడపళని మెట్రో రైలు
– ప్రారంభించనున్న పీఎం మోదీ
సాక్షి, చైన్నె: చైన్నె నగరవాసులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మెట్రో రైలు ప్రాజెక్ట్ రెండో దశ ప్రారంభానికి రంగం సిద్ధమైంది.పూందమల్లి – వడపళని మధ్య కొత్త మెట్రో రైలు సర్వీసును అక్టోబర్ 11న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ ఆర్.వి. అర్లేకర్, ముఖ్యమంత్రి విజయ్ తదితరులు పా ల్గొననున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వ యంగా మెట్రో రైలులో పోరూరు వరకు ప్రయాణించి ఈ సేవలను ప్రారంభిస్తారు. అనంతరం ఐఐటీ చైన్నె క్యాంపస్‌లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో వెల్లూరు విమానాశ్రయం, కొత్త జాతీయ రహ దారి ప్రాజెక్టులను ప్రారంభించడంతోపాటు, పలు కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు.
ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్: మెట్రో రెండో దశలో భాగంగా లైట్‌హౌస్ నుండి పూందమల్లి బైపాస్ వరకు ఉన్న 4వ మార్గంలోని పనులు పూర్తయ్యాయి. రైల్వే భద్రతా కమిషనర్ గత మే నెలలోనే ఈ 14.64 కిలోమీటర్ల మార్గాన్ని తనిఖీ చేసి భద్రతా ధృవీకరణ పత్రం కూడా జారీ చేశారు. అయితే, రైలు సేవలలో జాప్యం తప్పలేదు. కేవలం ట్రయ ల్ రన్ మాత్రమే నిర్వహిస్తూ వచ్చారు. ఈ మార్గంలో తొలి దశలో ప్రతి 10 నిమిషాలకు ఒక రైలు చొప్పున నడపాలని అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు.తాజాగా ప్రారంభోత్సవానికి ముహూర్తం కుదరడంతో ఆ పరిసర వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే వడపళని–పోరూర్ మధ్యలో ఉన్న సాలిగ్రామం, అలపాక్కం రైల్వే స్టేషన్లలో నిర్మాణ పనులు ఇంకా పూర్తి కానందున... ప్రారంభంలో కొద్ది రోజులు ఆ రెండు స్టేషన్లలో రైళ్లు ఆగి పరిస్థితులు లేనట్టు సమాచారం. తొలి డ్రైవర్ రహిత మెట్రో రైలు ఈమార్గంలో పయనించనున్నడంతో ఎదురు చూపులుపెరిగాయ.
ఎంజీఆర్ ఆస్తులపై జానకి కుమారుడి పిటిషన్ తిరస్కృతి
– మద్రాస్ హైకోర్టు తీర్పు
సాక్షి, చైన్నె : దివంగత మాజీ ముఖ్యమంత్రి భారతరత్న ఎం.జి. రామచంద్రన్ (ఎంజీఆర్) ఆస్తులకు సంబంధించి మద్రాస్ హైకోర్టులో కీలక తీర్పు వెలువడింది. తిరుచ్చిలోని ఎంజీఆర్ ఆస్తిపై పరిపాలనా హక్కులు కోరుతూ వి.ఎన్. జానకి మొదటి భర్త కుమారుడు సురేంద్రన్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఎంజీఆర్ 1987లో రాసిన వీలునామాలో తిరుచ్చిలోరని ఆస్తి గురించి ప్రస్తావన లేదని, ఆ ఆస్తిని ఇప్పటివరకు ఎవరికీ కేటాయించలేదని సురేంద్రన్ తరఫున్యాయవాది కోర్టులో వాదించారు. ఎంజీఆర్ ఆత్మకథ ‘నేను ఎందుకు పుట్టాను’ కాపీరైట్ కేసులో జానకిని ఎంజీఆర్ వారసురాలిగా సుప్రీంకోర్టు ప్రకటించిందని, ఈదృష్ట్యా, జానకి కుమారుడైన తనకు ఆ ఆస్తిని నిర్వహించే హక్కు ఇవ్వాలని కోరారు. అయితే, తిరుచ్చిలోని ఎంజీఆర్ ఆస్తిలో తమకు కూడా హక్కులు ఉన్నాయని, తమను కూడా ఈ కేసులో భాగస్వాములను చేయాలని ఎంజీఆర్ సోదరుడు చక్కర పాణి వారసులు వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలను విన్న జస్టిస్ ఎ.డి. మరియా గ్లాడ్ నేతృత్వంలోని ధర్మాసనం జానకి ఎంజీఆర్ వారసురాలని నిరూపించడానికి సరైన సాక్ష్యాధారాలను సమ ర్పించలేదని పేర్కొన్నారు.
స్టాలిన్


